దమ్ముంటే ఇప్పుడు కాపీ కొట్టండిరా.. విద్యార్థులకు టీచర్ల సవాల్!
ఈ మధ్యకాలం యువత పరీక్షల్లో కాపీ కొట్టేందుకు వివిధ రకాల పద్దతులను అనుసరిస్తున్నారు. ఆయా విద్యాసంస్థలు ఈ మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా గానీ.. విద్యార్థులు మాత్రం మారట్లేదు. ఇలా కాదని కర్ణాటకకు చెందిన ఓ విశ్వ విద్యాలయం అధికారులు వినూత్న రీతిలో కాపీయింగ్‌ను అరికట్టే చర్యలు చేపట్టారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల తలలకు అట్టపెట్టలు తగిలించి పరీక్షలు రాయించారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి […]
ఈ మధ్యకాలం యువత పరీక్షల్లో కాపీ కొట్టేందుకు వివిధ రకాల పద్దతులను అనుసరిస్తున్నారు. ఆయా విద్యాసంస్థలు ఈ మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా గానీ.. విద్యార్థులు మాత్రం మారట్లేదు. ఇలా కాదని కర్ణాటకకు చెందిన ఓ విశ్వ విద్యాలయం అధికారులు వినూత్న రీతిలో కాపీయింగ్‌ను అరికట్టే చర్యలు చేపట్టారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల తలలకు అట్టపెట్టలు తగిలించి పరీక్షలు రాయించారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని భగత్ పీయూ కాలేజీలో థర్డ్ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. విద్యార్థులు కాపీలు కొట్టేందుకు వీలు కాకుండా వారి ముఖాలకు అట్టపెట్టలు పెట్టించి మరీ పరీక్ష రాయించారు. కళ్ల భాగం వరకే తెరిచి ఉండేలా రంద్రాలు పెట్టడంతో కొంతమందికి ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కాలేజీ యాజమాన్యంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ ఉదంతం అంతా కర్ణాటక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎస్. సురేష్ వరకు చేరడంతో.. దీనిపై అయన స్పందిస్తూ కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని.. విద్యార్థులను జంతువుల మాదిరిగా చూస్తున్నారని మండిపడ్డారు.
This is totally unacceptable. Nobody has any right to treat anybody more so students like animals. This pervertion will be dealt with aptly. https://t.co/y69J0XcTA6
— S.Suresh Kumar, Minister – Govt of Karnataka (@nimmasuresh) October 18, 2019