చంద్రబాబుకు బిజెపి బంపర్ ఆఫర్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) బంపర్ ఆఫర్ ఇచ్చింది. “టిడిపిని బిజెపిలో విలీనం చేసే ఉద్దేశం వుంటే చెప్పండి.. అమిత్ షాతో మాట్లాడి సెట్ చేస్తానన్నారు” బిజెపి రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు. టిడిపికి ఇపుడు రాజ్యసభాపక్షం లేదు.. లోక్ సభ సభ్యులు ముగ్గురు కూడా ఎంతకాలం వుంటారో తెలియదు.. సో.. టిడిపిని బిజెపిలో విలీనం చేయాలనుకుంటే ఇదే కరెక్టు టైమ్.. ఈ విషయంలో […]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) బంపర్ ఆఫర్ ఇచ్చింది. “టిడిపిని బిజెపిలో విలీనం చేసే ఉద్దేశం వుంటే చెప్పండి.. అమిత్ షాతో మాట్లాడి సెట్ చేస్తానన్నారు” బిజెపి రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు. టిడిపికి ఇపుడు రాజ్యసభాపక్షం లేదు.. లోక్ సభ సభ్యులు ముగ్గురు కూడా ఎంతకాలం వుంటారో తెలియదు.. సో.. టిడిపిని బిజెపిలో విలీనం చేయాలనుకుంటే ఇదే కరెక్టు టైమ్.. ఈ విషయంలో చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకుంటే.. స్వయంగా అధిష్టానంతో మాట్లాడతానని జివిఎల్ నరసింహారావు శనివారం విజయవాడలో ఆఫర్ ఇచ్చారు.
గతంలో చంద్రబాబు పోలవరంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకు లెక్కలు అడిగాము. వాటికి చంద్రబాబు లెక్కలు చెప్పలేదు. ఖర్చు చేసిన నిధులకు చంద్రబాబు లెక్కలు ఎందుకు చెప్పలేక పోతున్నారో అర్ధం కావడం లేదు. మోదీని చాలా నీచంగా చంద్రబాబు తిట్టారు. దేశంలో ఏ నాయకుడు తిట్టని విధంగా తిట్టారు. ఓడిపోయిన పార్టీ నుంచి పది మంది నాయకులు వస్తే తమ పార్టీ బలపడదని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. కొందరు రాజకీయ భవిష్యత్ కోసం బీజేపీలో చేరుతున్నారని అలాంటి వారితో పార్టీ బలపడదని స్పష్టం చేశారు.
‘చంద్రబాబును మేము భయపెట్టడం లేదు. అవినీతి ఎవరు చేసిన శిక్ష తప్పదు అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మోదీ మాటలకు భుజాలు తడుముకొంటే మేము ఏమి చేయలేము. పోలవరంలో అవినీతి జరగలేదని మా పార్టీ నేతలు ఎవరూ చెప్పలేదు. పోలవరంలో దాదాపు రూ. 2200 కోట్ల మేర అవినీతి జరిగిందని నిపుణుల కమిటీ నిర్ధారించింది. దానిపై రివర్స్ టెండరింగ్ వెళ్లామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతోంది.
పోలవరం, అమరావతిలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పు తీసుకోవడం తప్పుకాదు, దాన్ని ఎన్నికల్లో గెలవడం కోసం దుర్వినియోగం చేయడం చేయడం తప్పు. అప్పు చేసిన చంద్రబాబు పసుపు కుంకుమ కింద ప్రజా ధనాన్ని ఖర్చు చేశారు.
గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే దానిపై ఆసక్తి ఉండేది. కానీ మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపిలు బీజేపీకి కనీస పోటీ ఇవ్వలేక పోతున్నాయి. దీంతో మహారాష్ట్రతో పాటు హరియాణలో బీజేపీ గెలవడం తథ్యం. తెలుగు రాష్ట్రాల్లో కూడా బలపడాలనే దాని మీద దృష్టి పెట్టాము. ఆంధ్రప్రదేశ్‌లో రైతుల సమస్యలు మీద దృష్టి పెట్టాము. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాము. రాష్ట్రానికి మరిన్ని నిధులు జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను.