పార్ట్ టైమ్ పాలిటిక్స్.. రాహు‌ల్‌పై జోరుగా సెటైర్స్

పార్ట్ టైమ్ పాలిటిక్స్.. రాహు‌ల్‌పై జోరుగా సెటైర్స్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీరుపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాభవం చెందిన తర్వాత ఆయన పార్టీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పార్టీ నేతలపై సీరియస్ అయ్యారు. పార్టీ ఓటమికి అందరూ బాధ్యత వహించాలంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాహుల్ వ్యాఖ్యలతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ శ్రేణులు వారి వారి బాధ్యతలకు రాజీనామాలు […]

TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Oct 19, 2019 | 6:15 PM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీరుపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాభవం చెందిన తర్వాత ఆయన పార్టీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పార్టీ నేతలపై సీరియస్ అయ్యారు. పార్టీ ఓటమికి అందరూ బాధ్యత వహించాలంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాహుల్ వ్యాఖ్యలతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ శ్రేణులు వారి వారి బాధ్యతలకు రాజీనామాలు చేశారు. ఆ తర్వాత కొత్త పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని అంతా భావించారు. ఆయన తన కొత్త టీం ఏర్పాటుకోసమే సీనియర్లకు చెక్ పెట్టి.. కొత్త వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తారని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. సీన్ రివర్స్.

రాహుల్ గాంధీ తన బాధ్యతల నుంచి తప్పుకుని.. సాధారణ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. అయితే గాంధీ కుటుంబం కాకుండా.. ఇతర నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించాలని రాహుల్ అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పార్టీ పగ్గాలు మళ్లీ మీరే తిరిగి చేపట్టాలంటూ రాహుల్‌పై ఒత్తిడి వచ్చింది. అయినా కూడా రాహుల్ వెనక్కి తగ్గలేదు. ఏకంగా ఆయన సోషల్ మీడియాలో కూడా అధ్యక్ష బాధ్యతను తొలగించి.. సాధారణ కార్యకర్త అన్నట్లు ఫ్రోఫైల్ నేమ్ ఛేంజ్ చేసుకున్నారు. ఆ తర్వాత సోనియా గాంధీనే మళ్లీ తిరిగి తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు.

అయితే ఇటీవల రాహుల్ గాంధీ.. పార్టీ మీటింగ్‌లకు కూడా గైర్హాజరు అయ్యారు. అంతేకాదు.. ఓ వైపు హర్యానా, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే.. ఏ మాత్రం పట్టించుకోకుండా ఉన్నారు. ఏదో ఫార్మాలిటీగా.. రెండు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంతేకాదు.. సార్వత్రిక ఎన్నికల ముందు చేసిన తప్పే మళ్లీ చేస్తున్నారు. అప్పట్లో చేసిన రాఫెల్ కుంభకోణం, నోట్ల రద్దు అంశాలు బెడిసికొట్టినా కూడా.. మళ్లీ అదే పాట పాడుతున్నారు.

అంతేకాదు.. పాలిటిక్స్‌ అంటే రాహుల్ దృష్టిలో పార్ట్‌ అన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఓ వైపు ఎన్నికలకు రెండు రోజులు కూడా లేదు. రాజకీయ నేతలు ఎవరైనా సరే.. ఈ సమయంలో సమయం దొరికితే గెలుపు కోసం క్యాడర్‌తో పక్కా ప్లాన్లు వేస్తూ ఉంటారు. వేస్తుంటారు కాదు.. వేయాల్సిందే. ఎందుకంటే అది రాజకీయ చదరంగం. ప్రత్యర్థులను ఎదుర్కోవాలంటే.. ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. అది పార్టీ అగ్రనేతల పని. కానీ ఇక్కడ రాహుల్ తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అందుకు తాజాగా జరిగిన ఓ ఘటనే ఉదాహరణ. హర్యానాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రోజు ఆయన హెలికాప్టర్ అత్యవసరంగా రేవారిలో ల్యాండ్‌ కావాల్సి వచ్చింది. దీంతో అక్కడ క్రికెట్‌ ఆడుతున్న విద్యార్థుల వద్దకు రాహుల్‌ చేరుకుని వారితో క్రికెట్‌ ఆడారు. దీనిపై రాహుల్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు ఎన్నికలకు రెండు. మూడు రోజులు కూడా లేదు. సమయం దొరికితే పార్టీ శ్రేణులతో గెలుపు గురించి వ్యూహాలను పదును పెట్టాల్సింది పోయి.. ఇలా ఆడుకుంటూ ఉండటమేంటని.. కొందరు సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, రాహుల్ పిల్లలతో క్రికెట్ ఆడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu