బన్నీ- కొరటాల శివ మూవీ స్టోరీలైన్ ఇదేనా..!

బన్నీ- కొరటాల శివ మూవీ స్టోరీలైన్ ఇదేనా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుసపెట్టి సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఈ ఏడాది 'అల.. వైకుంఠపురములో' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బన్నీ..

Ravi Kiran

|

Aug 03, 2020 | 5:31 PM

Vizag Gas Leakage Story Line: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుసపెట్టి సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఈ ఏడాది ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బన్నీ.. సుకుమార్ డైరెక్షన్‌లో ‘పుష్ప’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కరోనా వ్యాప్తి కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయింది. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా స్టోరీ లైన్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది.

వైజాగ్ గ్యాస్ లీకేజ్ ఘటనను స్పూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇందులో బన్నీ స్టూడెంట్ లీడర్‌గా, రీసెర్చర్‌గా కనిపించనున్నాడట. భారీ పరిశ్రమల వల్ల ప్రకృతి ఎలా నాశనం అవుతుంది.? స్వచ్చమైన పల్లెలు ఎలా అంతరించిపోతున్నాయి.? అనే అంశాలుపై ఈ సినిమా ఫోకస్ చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Also Read: సుశాంత్ చనిపోయే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసింది ఇవే.!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu