మెగాస్టార్ ఇంట్లో రాఖీ సందడి

"నా చెల్లెళ్ళిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు."...

మెగాస్టార్ ఇంట్లో రాఖీ సందడి

అన్నచెల్లెలు, అక్కాతమ్ముళ్లు అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి పండగ. రాఖీ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి తన ఇద్దరు చెల్లెళ్లతో రాఖీ కట్టిచుకున్నారు. చిరంజీవి చెల్లెళ్లయిన మాధవి, విజయదుర్గ తమ అన్నయ్యకు రాఖీ కట్టారు.అన్నయ్య దీవెనలు తీసుకున్నారు. స్వీట్లు తినిపించి రాఖీ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన ఒకే రకమై కానుకలను అందించారు. ఇద్దరికి రెండు హారాలు బహుమానంగా అందించారు. ఇద్దరకీ ఒకేలాంటి గిఫ్ట్ ఇస్తున్నాను.. మళ్లీ కొట్టుకోకుండా అంటూ చిరు తన బహుమతిని అందించారు.

చిరంజీవి అలా అనగానే ముగ్గురు ఒకేసారి నవ్వుతూ అప్యాయంగా ఒకరినొకరు కౌగిలించుకున్నారు.  “నా చెల్లెళ్ళిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.” తెలిపారు మెగాస్టార్. చిరుకు ప్రతీ ఏడాది ఆయన ఇద్దరు చెల్లెల్లు వచ్చి రాఖీ కట్టి ఆశీస్సులు పొందుతూ ఉంటారు.

Click on your DTH Provider to Add TV9 Telugu