అమిత్ షా ఎయిమ్స్ లో ఎందుకు చేరలేదు ? శశిథరూర్
కరోనా పాజిటివ్ కి గురైన హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఎందుకు చేరలేదని కాంగ్రెస్ నేత శశిథరూర్ ప్రశ్నించారు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే..
కరోనా పాజిటివ్ కి గురైన హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఎందుకు చేరలేదని కాంగ్రెస్ నేత శశిథరూర్ ప్రశ్నించారు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే.. పవర్ లో ఉన్నవారు ప్రభుత్వ సంస్థలను (ఆసుపత్రులను) ప్రోత్సహించాల్సి ఉంటుందన్నారు. (అమిత్ షా…. ఢిల్లీ సమీపంలోని గుర్ గావ్ లో గల ప్రైవేటు ఆసుపత్రి ….మేదాంత హాస్పిటల్’ లో చేరారు.) అస్వస్థత పాలైన మన హోం మంత్రి ఎయిమ్స్ బదులు పొరుగు న ఉన్న ప్రైవేటు హాస్పిటల్ ని ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందని థరూర్ ట్వీట్ చేశారు.
నాడు భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రబోధించిన విజన్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఎయిమ్స్ వంటి ప్రాజెక్టులు రూపు దిద్దుకుంటున్నాయని ఈ హాస్పటల్ పై ఒకరు చేసి న ట్వీట్ ని పురస్కరించుకుని శశిథరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 కి గురైన కర్ణాటక సీఎం ఎడియూరప్ప, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇద్దరూ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.