డిప్రెషన్ వల్లే సుశాంత్ మృతి, ముంబై పోలీసుల వెల్లడి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కొన్ని నెలలుగా డిప్రెషన్ తో బాధ పడుతూ వచ్చాడని, ఇందుకు మందులు తీసుకుంటూ వచ్చా డని ముంబై పోలీసు చీఫ్ పరమ్ వీర్ సింగ్ తెలిపారు. తన సూసైడ్ కి ముందు

డిప్రెషన్ వల్లే సుశాంత్ మృతి, ముంబై పోలీసుల వెల్లడి
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 03, 2020 | 4:04 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కొన్ని నెలలుగా డిప్రెషన్ తో బాధ పడుతూ వచ్చాడని, ఇందుకు మందులు తీసుకుంటూ వచ్చా డని ముంబై పోలీసు చీఫ్ పరమ్ వీర్ సింగ్ తెలిపారు. తన సూసైడ్ కి ముందు ఆయన తన మాజీ మేనేజర్ దిశా శాలియన్ పేరును గూగుల్ లో చాలాసార్లు సెర్చ్ చేశాడని వెల్లడైందని ఆయన చెప్పారు. సుశాంత్ మృతికి సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు తెలియజేస్తూ.. అతని మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ లను పరిశీలించిన అనంతరం ఈ విషయం తెలిసిందన్నారు. జూన్ 9 న దిశా తన అపార్ట్ మెంట్ పై నుంచి కిందికి దూకి సూసైడ్ చేసుకోగా.. సుశాంత్ జూన్ 14 న తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దిశా ఆత్మహత్యకు తానే కారణమనే ఊహాగానాలు ఆయన బలవన్మరణానికి కారణమై ఉండవచ్ఛునని పరమ్ వీర్ సింగ్ అభిప్రాయపడ్డారు. మానసిక ఒత్తిడి కారణంగా సుశాంత్   నెలలపాటు మందులు తీసుకుంటూ వచ్చాడు..అయితే ఏ పరిస్థితులు అతని సూసైడ్ కి దారితీశాయన్నది మా దర్యాప్తులో తేలుతుంది అని ఆయన చెప్పారు.

సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి వాంగ్మూలాన్ని తాము రెండు సార్లు తీసుకున్నామని, అయితే ఆమె ఎక్కడుందో చెప్పలేనని ఆయన అన్నారు.రియా ఆచూకీ తమకు తెలియడంలేదని   బీహార్ పోలీసులు ప్రకటించిన విషయంపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. సుశాంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రియా సోదరుడు, బావను, మరో ఇద్దరిని విచారించినా  అనుమానించదగిన అంశాలేవీ కనబడలేదన్నారు.