Unlock 3.0: ఆగష్టు 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్‌లు ఓపెన్.. తాజా మార్గదర్శకాలివే
అన్‌లాక్‌డౌన్ 3.0లో భాగంగా ఈ నెల 5 నుంచి దేశవ్యాప్తంగా యోగా సెంటర్లు, జిమ్‌లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే.
Guidelines for Gyms and Yoga Centres: అన్‌లాక్ 3.0లో భాగంగా ఈ నెల 5 నుంచి దేశవ్యాప్తంగా యోగా సెంటర్లు, జిమ్‌లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాటికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. కోవిడ్ 19 కంటైన్‌మెంట్ జోన్లలో యోగా సెంటర్లు, జిమ్‌లను ఎట్టి పరిస్థితుల్లో తెరవకూడదని కేంద్రం తెలిపింది. అలాగే 65 సంవత్సరాలు దాటిన వారు, గర్భిణులు, 10 సంవత్సరాల లోపు పిల్లలు వెంటిలేషన్ లేని జిమ్‌లకు వెళ్లకపోవడమే మంచిదని సూచించింది.
కేంద్రం విధించిన మార్గదర్శకాలివే: 1. ప్రతి ఒక్కరు ఆరు అడుగుల దూరం కచ్చితంగా పాటించాలి. 2. పరిసరాల్లో ప్రతి ఒక్కరు మాస్క్‌లను వాడాలి. అలాగే యోగా, ఎక్సర్‌సైజ్ చేసేటప్పుడు వైజర్(తేలికపాటి) వాడాలి. n-95 మాస్క్‌లను వాడితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తొచ్చు. 3.తరచుగా చేతులు శుభ్రపరుచుకుంటూ ఉండాలి. ఆల్కాహాల్‌తో కూడిన శానిటైజర్లను వాడటం మంచిది. 4. ప్రతి ఒక్కరు దగ్గే సమయంలో మూతి, ముక్కును కవర్ చేయాలి. వాడిన టిష్యూలను పద్ధతిగా పడేయాలి. 5.ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వెంటనే రాష్ట్ర లేదా జిల్లా హెల్ప్‌లైన్‌ని సంప్రదించడం మంచిది. 6.పరిసర ప్రదేశాల్లో ఉమ్మడం నిషేధం. 7. ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని వాడటం మంచిది.
ఇక ఈ నిబంధనలకు అనుగుణంగానే యోగా సెంటర్లు, జిమ్‌లను తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటనలో వివరించింది.
Read This Story Also: ఆ రోజు సుశాంత్ వెక్కి వెక్కి ఏడ్చి పడిపోయాడు: సిద్ధార్థ్ పితాని