ఆ రోజు సుశాంత్ వెక్కి వెక్కి ఏడ్చి పడిపోయాడు: సిద్ధార్థ్‌ పితాని

బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసు మిస్టరీ సినిమాను తలపిస్తోంది. ఆయన ఆత్మహత్య చేసుకొని మరణించాడని ముంబయి వైద్యులు, పోలీసులు చెబుతున్నప్పటికీ

ఆ రోజు సుశాంత్ వెక్కి వెక్కి ఏడ్చి పడిపోయాడు: సిద్ధార్థ్‌ పితాని
Follow us

| Edited By:

Updated on: Aug 03, 2020 | 3:22 PM

Siddharth Pithani on Sushant: బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసు మిస్టరీ సినిమాను తలపిస్తోంది. ఆయన ఆత్మహత్య చేసుకొని మరణించాడని ముంబయి వైద్యులు, పోలీసులు చెబుతున్నప్పటికీ.. పలువురు సుశాంత్‌ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రోజుకో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వస్తోంది. సుశాంత్‌ విషయంలో ఆయన సన్నిహితులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. దీంతో ఎవరు చెబుతున్నది నిజం..? ఎవరు చెబుతున్నది అబద్దం..? అన్న డైలామాలో కొనసాగుతోంది. అంతేకాదు ఈ కేసు విషయంలో ఇప్పుడు ముంబయి పోలీస్‌ వర్సెస్‌ బీహార్ పోలీసులుగా మారగా.. రాజకీయాల్లో సైతం సుశాంత్‌ కేసు హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇదిలా ఉంటే ఈ కేసులో రియాకు వ్యతిరేకంగా చెప్పమని సుశాంత్‌ కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారంటూ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన అతడి స్నేహితుడు, మేనేజర్ సిద్ధార్థ్‌ పితానీ తాజాగా మరికొన్ని విషయాలు పంచుకున్నారు. సుశాంత్‌తో పాటు బాంద్రాలోని ఇంట్లో సిద్ధార్థ్‌ కూడా నివసిస్తుండగా.. జూన్‌8న సుశాంత్‌ మాజీ మేనేజర్ దిశ ఆత్మహత్యతో సుశాంత్‌ చాలా అప్‌సెట్‌ అయ్యాడని సిద్ధార్థ్‌ తెలిపారు. దిశ చాలా తక్కువ సమయం మాత్రమే సుశాంత్‌కి మేనేజర్‌గా పనిచేశారని, ఒక్కసారి మాత్రమే ఆమె సుశాంత్‌ని కలిశారని సిద్ధార్థ్‌ వెల్లడించారు.

అయితే దిశ మరణం సుశాంత్‌ని చాలా బాధించిందని ఆయన పేర్కొన్నారు. ”రియా ఇంట్లో నుంచి వెళ్లిన తరువాత సుశాంత్ సోదరి అక్కడకు వచ్చింది. ఆ మరుసటి రోజే దిశ ఆత్మహత్య చేసుకొని మరణించింది. ఆ వార్త విని సుశాంత్‌ ఏడుస్తూనే ఉన్నాడు. అలానే పడిపోయాడు. ఆ సమయంలో సుశాంత్‌ సోదరి అతడికి అన్నం తినిపించి ఓదార్చింది. దిశ సంఘటన సుశాంత్‌ని ఎంత బాధించిందో మేమందరం చూశాము” అని సిద్ధార్థ్‌ తెలిపారు. ఇక ఆ రోజు సుశాంత్‌ నిద్రపోయిన తరువాతే తాను తన సొంత రూమ్‌కి వచ్చానని అతడు వెల్లడించారు. అంతేకాదు సుశాంత్‌ డిప్రెషన్‌తో బాధపడేవాడని, తానే దగ్గరుండి మందులు ఇచ్చేవాడినని చెప్పుకొచ్చారు. తనతో కలిసి ఉండమని చెప్పిన సమయంలోనూ సుశాంత్..‌ ”నాకు ఎవరూ లేరు. ఇక్కడి నుంచి దూరంగా వెళ్దాం” అని అన్నాడంటూ సిద్ధార్థ్‌ వెల్లడించారు.

Read This Story Also: కోవిడ్‌ ఆసుపత్రిలో సిబ్బంది చేతివాటం.. సెల్‌ఫోన్లు, డబ్బు చోరీ