ట్రైన్ 18 ప్రయాణికులకు స్టార్ హోటల్ రుచులు

ఈ నెల 15వతేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్న ట్రైన్ 18లోని ప్రయాణికులు స్టార్ హోటల్ వంటకాలు రుచిచూడనున్నారు. భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన ట్రైన్ 18 ప్రయాణికులకు ఫైవ్ స్టార్ హోటల్ భోజనం పంపిణీ చేయాలని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) నిర్ణయించింది.  ట్రైన్ 18 కు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ గా పేరు పెట్టారు. ఢిల్లీ నుంచి వారణాసి వరకు నడపనున్న ఈ రైలులో ప్రయాణించే వారికి అలహాబాద్ నగరంలోని ఉన్నతస్థాయి […]

ట్రైన్ 18 ప్రయాణికులకు స్టార్ హోటల్ రుచులు
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 7:18 PM

ఈ నెల 15వతేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్న ట్రైన్ 18లోని ప్రయాణికులు స్టార్ హోటల్ వంటకాలు రుచిచూడనున్నారు. భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన ట్రైన్ 18 ప్రయాణికులకు ఫైవ్ స్టార్ హోటల్ భోజనం పంపిణీ చేయాలని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) నిర్ణయించింది.  ట్రైన్ 18 కు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ గా పేరు పెట్టారు.

ఢిల్లీ నుంచి వారణాసి వరకు నడపనున్న ఈ రైలులో ప్రయాణించే వారికి అలహాబాద్ నగరంలోని ఉన్నతస్థాయి రెస్టారెంట్ నుంచి అల్పాహారం, కాన్పూర్ నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్ నుంచి భోజనం తెప్పించి వడ్డించాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది.

గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలులో ప్రయాణికులు 8 గంటల్లో తమ గమ్య స్థానానికి చేరుకుంటారు.