స్టూడెంట్స్ తెలిసే తప్పు చేశారు: అమెరికా

దిల్లీ: అమెరికాలో భారత విద్యార్థుల అరెస్టుపై ప్రభుత్వం దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి అభ్యంతర పత్రం జారీ చేయడంపై అక్కడి ప్రభుత్వం స్పందించింది. భారత విద్యార్థులకు తప్పు చేస్తున్నామన్న విషయం ముందే తెలుసని చెప్పుకొచ్చింది. అంతేకాదు అక్రమంగా అమెరికాలో ఉండాలనే ఉద్దేశంతోనే వారు అలా చేశారని ఆరోపించింది. అయితే ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న భారత ప్రభుత్వం.. పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా విద్యార్థులను కలవడానికి భారత దౌత్య అధికారులకు పర్మీషన్ […]

స్టూడెంట్స్ తెలిసే తప్పు చేశారు: అమెరికా
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 10:12 PM

దిల్లీ: అమెరికాలో భారత విద్యార్థుల అరెస్టుపై ప్రభుత్వం దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి అభ్యంతర పత్రం జారీ చేయడంపై అక్కడి ప్రభుత్వం స్పందించింది. భారత విద్యార్థులకు తప్పు చేస్తున్నామన్న విషయం ముందే తెలుసని చెప్పుకొచ్చింది. అంతేకాదు అక్రమంగా అమెరికాలో ఉండాలనే ఉద్దేశంతోనే వారు అలా చేశారని ఆరోపించింది.

అయితే ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న భారత ప్రభుత్వం.. పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా విద్యార్థులను కలవడానికి భారత దౌత్య అధికారులకు పర్మీషన్ ఇవ్వాలని కోరింది. ఏజెంట్స్ ను, విద్యార్థులను ఒకేలాగా చూడొద్దని అప్పీల్ చేసింది. వీలైనంత త్వరగా వారిని విడుదల చేయాలని కోరింది. విద్యార్థులను బలవంతంగా అక్కడి నుంచి పంపొద్దని తెలిపింది. అలాగే భారత రాయబార కార్యాలయంలో 24గంటల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. అలాగే ఫార్మింగ్‌టన్‌ విశ్వవిద్యాలయం నకిలీదని భారత విద్యార్థులకు తెలియదని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఇప్పటికే అమెరికా ప్రభుత్వానికి వివరించారు.

విద్యార్థి వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నవారిని పట్టుకోవాలని భావించిన అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు ఓ నకిలీ విశ్వవిద్యాలయాన్ని సృష్టించారు. అందులో భాగంగా 8 మంది దళారులను, వారి ద్వారా చేరిన 129 మంది విద్యార్థులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫార్మింగ్‌టన్‌ వర్సిటీ మాత్రం జాతీయ గుర్తింపు ఉందని, ఆన్‌లైన్‌ తరగతులు కూడా అందుబాటులో ఉన్నాయని ప్రకటించుకోవడం గమనార్హం. ఒకసారి వారు తిరిగొస్తే మళ్లీ వీసా లభించడం అసాధ్యమని నిపుణుల అంటున్నారు. దీంతో ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.