హరీశ్‌రావుపై జగ్గారెడ్డి అనుమానం

హైదరాబాద్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైరయ్యారు. సింగూరు నుంచి నీటిని తరలించి సంగారెడ్డి ప్రజలకు అన్యాయం చేశారని, సంగారెడ్డి ప్రజల గొంతును ఎండగట్టారంటూ ఆయనను దుయ్యబట్టారు. కేటాయింపులు లేకున్నా శ్రీరాం సాగర్‌కు మాజీ నిటిపారుదల మంత్రి హరీశ్ రావు నీటిని ఎందుకు మళ్లించారని ప్రశ్నించారు. హరీశ్ రావు చేసిన ఈ చర్యకు అధికారులు కూడా అడ్డు చెప్పలేకపోయారని, కేసీఆర్ కుటుంబ సభ్యుడు కాబట్టే పట్టించుకోలేదని అన్నారు. అదే కేసీఆర్‌ అయితే […]

హరీశ్‌రావుపై జగ్గారెడ్డి అనుమానం
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 8:50 PM

హైదరాబాద్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైరయ్యారు. సింగూరు నుంచి నీటిని తరలించి సంగారెడ్డి ప్రజలకు అన్యాయం చేశారని, సంగారెడ్డి ప్రజల గొంతును ఎండగట్టారంటూ ఆయనను దుయ్యబట్టారు. కేటాయింపులు లేకున్నా శ్రీరాం సాగర్‌కు మాజీ నిటిపారుదల మంత్రి హరీశ్ రావు నీటిని ఎందుకు మళ్లించారని ప్రశ్నించారు.

హరీశ్ రావు చేసిన ఈ చర్యకు అధికారులు కూడా అడ్డు చెప్పలేకపోయారని, కేసీఆర్ కుటుంబ సభ్యుడు కాబట్టే పట్టించుకోలేదని అన్నారు. అదే కేసీఆర్‌ అయితే అలా జరగనిచ్చేవారు కాదని, కేసీఆర్‌కు చెడ్డపేరు తెచ్చేలా హరీశ్ రావు ప్రవర్తించారని తప్పు పట్టారు. అయితే దీని వెనక రాజకీయ కోణం ఉందని జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. తానిలా ప్రశ్నిస్తాను కాబట్టే తనను ఓడించాలని హరీశ్ ప్రయత్నించారని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా ప్రజలకు హరీశ్ రావు క్షమాపణలు చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.