వచ్చే ఎండాకాలం నిప్పుల ఉప్పెనను తలపిస్తుందని వాతావరణశాఖ నిపుణులు వెల్లడించారు. చల్లికాలం ఇంకో 10 రోజుల్లో వెళ్లిపోతోంది. వచ్చేది ఇక వేసవినే ఈ సారి ఉష్ణోగ్రతలు మామూలు స్థాయిలో ఉండవని అంటుంది వాతావరణశాఖ. రెండింతల రెట్టింపుతో గత రికాడర్డులను ఎండలు అధిగమిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వేసవిలో అల్పపీడనాలు, మబ్బులు కనిపించే శాతం తక్కువని అందుకే సూర్యరశ్మి నేరుగా భూమిని తాకుందని చెబుతున్నారు. దీని వల్ల విపరీతమైన వేడి గాలులు వస్తాయని, సూర్యని తాపం ఎక్కువగా ఉంటుందని అన్నారు.
ఈ ఎండలపై తగు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణ, పంట నష్టాలకు అవకాశం ఉందని, ఎప్పటికప్పుడు వేడి తీవ్రత గురించి తెలుసుకున్న తరువాతనే బయటకు వస్తే మంచిదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి ఎండలు మండిపోనున్నాయని చిన్న చిన్న రిజర్వాయర్లలో, చెరువుల్లో నీరు ఇంకుపోయే ప్రమాదముందని అంటున్నారు. గతంలో 2016లో వచ్చిన ఎండల తీవ్రత కంటే ఇప్పుడు 2019లో వచ్చే ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుందని అంటున్నారు. ఎప్పుడూ చూడలేనంత ఎండను ఈ సారి పరిచయం అవుతాయన్నారు వాతావరణశాఖ నిపుణులు. ప్రజలు ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాలు కూడా చొరవ చూపాలన్నారు.