భారత్‌లోనే ఐపీఎల్.. దాదా క్లారిటీ..
ఐపీఎల్‌ను భారత్‌లో నిర్వహించడమే తమ తొలి ప్రాధాన్యమని గంగూలీ స్పష్టం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ లేకుండా క్రికెట్ ముగియడం ఎవరికీ ఇష్టం లేదన్న ఆయన..

కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ విండోలో ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు విదేశాల్లో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని పలు వార్తలు వస్తుండటంతో.. తాజాగా వాటన్నింటిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు.
ఐపీఎల్‌ను భారత్‌లో నిర్వహించడమే తమ తొలి ప్రాధాన్యమని గంగూలీ స్పష్టం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ లేకుండా క్రికెట్ ముగియడం ఎవరికీ ఇష్టం లేదన్న ఆయన.. కనీసం 35, 40 రోజుల సమయం దొరికినా ఐపీఎల్ నిర్వహిస్తామని వెల్లడించాడు. కరోనా వ్యాప్తి కారణంగా దేశంలో ఐపీఎల్ నిర్వహణకు సాధ్యం కాకపోతే.. అప్పుడు విదేశాల్లో నిర్వహించేందుకు ఆలోచిస్తామన్నారు.
ఐపీఎల్ విదేశాల్లో నిర్వహించాలంటే.. భారీగా ఖర్చవుతుందని.. కాబట్టి ఫ్రాంచైజీలతో చర్చించిన తర్వాతే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని గంగూలీ అన్నారు. అలాగే దేశవాళీ క్రికెట్ టోర్నీల నిర్వహణ కూడా కరోనాపై ఆధారపడి ఉందన్నారు. ఒక చోట నుంచి వేరే చోటుకు ప్రయాణించేందుకు తగిన సౌకర్యాలు ఉంటేనే రంజీ, దులీప్, విజయ్ హజారే సహా మిగిలిన టోర్నీల నిర్వహణ ఉంటుందన్నారు.
Also Read:
తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!
భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..
వారంతా కంపార్ట్‌మెంటల్‌లో పాస్.. ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయం..
ఆ 8 రాష్ట్రాల్లో కరోనా స్వైరవిహారం.. లిస్టులో ఏపీ, తెలంగాణ..!