ఆ ఒక్కటి మినహా.. భారతీయ న్యూస్‌ ఛానెళ్లను నిలిపివేసిన నేపాల్‌

ఇటీవల కాలంలో భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న నేపాల్ మరోసారి తన అక్కసును వెల్లగక్కింది. దూరదర్శన్‌ మినహా భారత్‌కి చెందిన అన్ని న్యూస్ ఛానెళ్ల ప్రసారాలను నిలిపి వేసింది

ఆ ఒక్కటి మినహా.. భారతీయ న్యూస్‌ ఛానెళ్లను నిలిపివేసిన నేపాల్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 09, 2020 | 10:11 PM

ఇటీవల కాలంలో భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న నేపాల్ మరోసారి తన అక్కసును వెల్లగక్కింది. దూరదర్శన్‌ మినహా భారత్‌కి చెందిన అన్ని న్యూస్ ఛానెళ్ల ప్రసారాలను నిలిపి వేసింది. దీంతో గురువారం సాయంత్రం నుంచి భారత న్యూస్ ఛానెళ్లను కేబుల్ ఆపరేటర్లు నిలిపివేశారు. నేపాల్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రసారాలు చేస్తున్నారని ఆరోపిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అక్కడి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా మరోవైపు నేపాల్‌లోని రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి చైనా, పాకిస్థాన్‌. నేపాల్‌ సహకారంతో భారత్‌ను దెబ్బ తీయాలని ఈ రెండు దేశాలు ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.