2022 నాటికి భారత్‌లో 82 కోట్ల స్మార్ట్‌ఫోన్ యూజర్లు..!

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో మొబైల్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేం. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) కేపీఎంజీ ఇండియా భాగస్వామ్యంతో ఓ నివేదికను విడుదల చేసింది.

2022 నాటికి భారత్‌లో 82 కోట్ల స్మార్ట్‌ఫోన్ యూజర్లు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 09, 2020 | 10:24 PM

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో మొబైల్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేం. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) కేపీఎంజీ ఇండియా భాగస్వామ్యంతో ఓ నివేదికను విడుదల చేసింది. డిజిటల్ గవర్నెర్స్ కోసం స్మార్ట్‌ఫోన్లకు పెరుగుతున్న ప్రజాదరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి ఈ నివేదికలో పేర్కొంది. ‘భారతదేశంలో డిజిటల్ గవర్నెర్స్‌కు స్మార్ట్‌ఫోన్ల సహకారం’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో  ప్రభుత్వ పాలన విధానాలతోపాటు సరసమైన స్మార్ట్‌ఫోన్ల లభ్యత, తక్కువ డేటా ధరలు వేగవంతమైన డిజిటైలేజషన్‌కు ఎలా దారితీశాయో వివరించింది.

వివరాల్లోకెళితే.. 2022 నాటి భారతదేశం 829 మిలియన్ల  స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను పొందగలదని వివరించింది. 2017లో భారతదేశం రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరించిందని, 2018లో 142.3 మిలియన్ యూనిట్ల రవాణాతో 14.5% వృద్ధి రేటును నమోదు చేసిందని నివేదిక వివరించింది. యాప్ మార్కెట్ కూడా భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొంది. 2019 నాటికి యాప్ డౌన్‌లోడ్‌ల పరంగా దేశం అగ్రస్థానంలో ఉందని నివేదిక తెలిపింది.

మరోవైపు.. గత రెండేళ్లలో డేటా ధరలు 90 శాతం పడిపోయాయని తెలిపింది. ఉదాహరణకు 2016లో నెలకు దాదాపు 2.7 జీబీ ఉపయోగించగా 2019 నాటికి అది ఏకంగా 10.4 జీబీకి పెరిగిందని తెలిపింది. అలాగే, 2016లో 152 రూపాయలు ఉన్న ఒక జీబీ డేటా ఇప్పుడు 10 రూపాయలకే అందుబాటులోకి వచ్చిందని తెలిపింది.