Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Army: సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన భారత సైన్యం.. విద్యార్థులకు ఉచితంగా..

Indian Army provides free tuition classes:భారత సైన్యం సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడడంతో ఇబ్బందులు పడుతోన్న విద్యార్థులకు..

Indian Army: సామాజిక సేవా కార్యక్రమాలకు  శ్రీకారం చుట్టిన భారత సైన్యం.. విద్యార్థులకు ఉచితంగా..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 08, 2021 | 11:55 AM

Indian Army provides free tuition classes: భారత సైన్యం సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడడంతో ఇబ్బందులు పడుతోన్న విద్యార్థులకు సైన్యం ఉచితంగా ట్యూషన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో 9వ తరగతి విద్యార్థులకు సైనికాధికారులు నిపుణులైన ఉపాధ్యాయులతో ట్యూషన్‌ చెప్పిస్తున్నారు. జమ్మూలోని సోపోరి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ ట్యూషన్‌కు 50 విద్యార్థులు హాజరవుతున్నారు. ఇంగ్లిష్‌, సోషల్‌ సైన్స్‌, గణితం, ఉర్దూ పాఠ్యాంశాలను అనుభవజ్ఞులతో ట్యూషన్ చెప్పిస్తున్నారు. కేవలం ట్యూషన్‌ చెప్పించడం మాత్రమే కాకుండా స్టేషనరీ సామాగ్రిని కూడా విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని సైనికాధికారి ఒకరు తెలిపారు. ఇక విద్యార్థులు కరోనా బారిన పడకుండా ఫేస్‌ మాస్కులు, శానిటైజర్లు, సామాజిక దూరం పాటిస్తూ అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.

Also Read: Renu Desai clarifies rumours : మహేష్ సినిమాలో నటించడంపై స్పందించిన రేణుదేశాయ్.. ఏమన్నారంటే