కొవిడ్ కేర్ సెంటర్లుగా 5,601 కోచ్‌లు : భారత రైల్వే

కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య అంతకంతకు పెరగుతూనే ఉంది. కేసుల సంఖ్య పెరగడంతో ఆస్పత్రుల్లోని పడకలు సైతం సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో 5,601 కోచ్‌లను కోవిడ్ కేర్ సెంటర్లు ఐసొలేషన్ వార్డులుగా మార్చేసింది.

కొవిడ్ కేర్ సెంటర్లుగా 5,601 కోచ్‌లు : భారత రైల్వే
Follow us

|

Updated on: Sep 18, 2020 | 7:45 PM

దేశంలో కరోనా వైరస్ కట్టడి ఇప్పుడప్పుడే కనిపించడంలేదు. రోజు రోజుకి పెరుగుతున్న కేసులతో మరింత ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య అంతకంతకు పెరగుతూనే ఉంది. కేసుల సంఖ్య పెరగడంతో ఆస్పత్రుల్లోని పడకలు సైతం సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో 5,601 కోచ్‌లను కోవిడ్ కేర్ సెంటర్లు ఐసొలేషన్ వార్డులుగా మార్చినట్టు కేంద్ర రైల్వే శాఖ శుక్రవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.

సెంట్రల్ రైల్వే 482 కోచ్‌లను ఐసొలేషన్ వార్డులుగా మార్చామని వెల్లడించింది. ఈస్ట్రన్ రైల్వే 381, ఈస్ట్ సెంట్రల్ రైల్వే 269, ఈస్ట్ కోస్ట్ రైల్వే 262, నార్త్‌రన్ రైల్వే 897, నార్త్ సెంట్రల్ రైల్వే 141, నార్త్ ఈస్ట్రన్ రైల్వే 217, నార్త్‌ఈస్త్ ఫ్రాంటియర్ రైల్వే 315, నార్త్ వెస్ట్రన్ రైల్వే 266, సదరన్ రైల్వే 573, సౌత్ సెంట్రల్ రైల్వే 486, సౌత్ ఈస్ట్రన్ రైల్వే 338, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 111, సౌత్ వెస్ట్రన్ రైల్వే 320, వెస్ట్రన్ రైల్వే 410, వెస్ట్ సెంట్రల్ రైల్వే 133తో కలిపి మొత్తం 5,601 కోచ్‌లను ఐసొలేషన్ వార్డులుగా మార్చినట్టు రైల్వే శాఖ ఆ ప్రకటనలో వివరించింది. కరోనా బాధితులకు భారత రైల్వే శాఖ తమవంతు సాయం అందించిందని పేర్కొంది. కొవిడ్ బారినపడ్డ వారి ప్రాణాలను నిలబెట్టాలన్న సంకల్పంతో రైల్వే కోచ్ లను ఐసోలేషన్ వార్డులుగా మార్చామని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది.