babies born in India on New Year’s Day: జనవరి 1, 2021న భారత్‌లో జననాల సంఖ్య ఎంతో తెలుసా..? ప్రపంచంలోనే టాప్
2021 కొత్త సంవత్సరం జనవరి 1న ఇండియాలో రికార్డు రేంజ్‌లో జననాలు నమోదు కానున్నాయని యునిసెఫ్ అంచనా వేసింది. దాదాపు 60 వేల జననాలతో...

babies born in India on New Year’s Day: 2021 కొత్త సంవత్సరం జనవరి 1న ఇండియాలో రికార్డు రేంజ్‌లో జననాలు నమోదు కానున్నాయని యునిసెఫ్ అంచనా వేసింది. దాదాపు 60 వేల జననాలతో భారత్ ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ ప్లేస్‌లో నిలవనుందని వెల్లడించింది. పాపులేషన్ పరంగా ఫస్ట్ ప్లేసులో ఉన్న చైనాలో 35,615 మంది నూతన సంవత్సరం తొలి రోజున జన్మించినట్టు యునిసెఫ్ వెల్లడించింది. అంటే మన దేశంలో నమోదైన జననాలతో పోల్చితే..చైనావి ఇంచుమించు సగం మాత్రమే. ఇక నైజీరియాలో 21,439, పాకిస్తాన్‌లో 14,161, ఇండోనేషియాలో 12,336 జన్మించినట్టు యునిసెఫ్ వివరించింది.
కాగా,2021 న్యూ ఇయర్ మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 3,71,504 శిశువులు జన్మిస్తారని యునిసెఫ్ తొలుత అంచనా వేసింది. వీటిలో 52 శాతం జననాలు 10 దేశాల్లోనే నమోదవుతాయని పేర్కొంది. మొత్తంగా ఈ ఏడాది 140 మిలియన్ల మంది ఈ భూమ్మీదకు అడుగుపెట్టనున్నారని వివరించింది.
Also Read :
APSRTC : ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త సర్వీస్.. పోస్టల్‌శాఖ ద్వారా కొరియర్.. ఇకపై హోమ్ డెలివరీ!
Leaders Visit To Ramatheertham : రాజకీయ రణరంగమైన రామతీర్థం..నేతల పర్యటనలతో పెరగిన హీట్
