Leaders Visit To Ramatheertham : రాజకీయ రణరంగమైన రామతీర్థం..నేతల పర్యటనలతో పెరగిన హీట్

|

Updated on: Jan 02, 2021 | 4:50 PM

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థానికి చేరుకున్నారు చంద్రబాబు. గన్నవరం చేరుకున్న చంద్రబాబు.. విశాఖ వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రామతీర్థానికి చేరుకున్నారు.

Leaders Visit To Ramatheertham : రాజకీయ రణరంగమైన రామతీర్థం..నేతల పర్యటనలతో పెరగిన హీట్

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థానికి చేరుకున్నారు చంద్రబాబు. గన్నవరం చేరుకున్న చంద్రబాబు.. విశాఖ వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రామతీర్థానికి చేరుకున్నారు. అనంతరం కొండపైకి వెళ్లారు. అయితే  ఆలయ గేటుకు తాళం వేసి ఉండటంతో..ఆయన లోనికి వెళ్లేందుకు వీలు చిక్కలేదు. దీంతో కోనేరును పరిశీలించారు. దాదాపు 15 నిమిషాలు చంద్రబాబు కొండపైనే ఉన్నారు. చంద్రబాబుతో పాటు రామతీర్థం ఆలయ ట్రస్టీ అశోకగజపతి రాజు, అచ్చెన్నాయుడుతో పాటు మరికొందరు నేతలు కొండపైన ఆలయం వద్దకు వెళ్లారు.

తొలుత వైసీపీ ఎంపీ విజయసాయి కొండపైకి వెళ్లి విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన వెళ్లిన అనంతరం చంద్రబాబు అక్కడికి వెళ్లారు.  కాగా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కార్యకర్తలతో కలిసి కొండ కింద ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో రామతీర్థం రాజకీయ రణక్షేత్రంగా మారింది. ప్రధాన పార్టీల నేతల రాకతో అక్కడ హైటెన్షన్ నెలకుంది. పోలీసులు అలర్టై భద్రత పెంచారు.

డిసెంబర్‌ 29న ఆ ప్రాంతంలోని కోదండరాముడి విగ్రహ శిరస్సును ధ్వంసం చేయడంతో తీవ్ర కలకలం చెలరేగింది. 30వ తేదీన కొండ దగ్గర్లోని కొలనులో రాముడి విగ్రహ శిరస్సు లభ్యమైంది.  ఘటనపై.. రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రధాన పార్టీల అగ్రనేతలు ఘటనా స్థలంలో పర్యటించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Jan 2021 04:14 PM (IST)

    ఆలయంలోకి వెళ్లేందుకు చంద్రబాబుకు ఆటంకం..బయట గేటుకు తాళం

    టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం కొండపైకి చేరుకున్నారు. అయితే పైన ఆలయ గేటుకు తాళం వేసి ఉండటంతో..ఆయన లోనికి వెళ్లేందుకు వీలు చిక్కలేదు. దీంతో కోనేరును పరిశీలించారు. దాదాపు 15 నిమిషాలు చంద్రబాబు కొండపైనే ఉన్నారు. చంద్రబాబుతో పాటు రామతీర్థం ఆలయ ట్రస్టీ అశోకగజపతి రాజు, అచ్చెన్నాయుడుతో పాటు మరికొందరు నేతలు ఆలయం వద్దకు చేరుకున్నారు.

  • 02 Jan 2021 03:51 PM (IST)

    రామతీర్థంలో వైసీపీ కార్యకర్తలపై రాళ్ల దాడికి నిరసన..

    రామతీర్థంలో తమ కార్యకర్తలపై రాళ్ల దాడి జరగడంతో వైసీపీ నిరసన వ్యక్తం చేస్తుంది. రాళ్ల దాడికి నిరసనగా విజయసాయి ఆధ్వర్యంలో  ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విగ్రహాల ధ్వంసానికి చంద్రబాబు, లోకేశ్ కారణమంటూ పునరుద్ఘాటించారు విజయ సాయి.  భక్తి అనేది వైఎస్సార్ కుటుంబంలోనే ఉందని పేర్కొన్నారు. ఎంత ఖర్చైనా సరే దేవాలయన్ని అభివృద్ది చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని విజయసాయి తెలిపారు.

  • 02 Jan 2021 03:37 PM (IST)

    కొండపైకి చంద్రబాబు..కొండ కింద విజయసాయి పూజలు

    మాజీ సీఎం చంద్రబాబు రామతీర్థం కొండపైకి వెళ్తున్నారు. మరోవైపు కొండ కింద గుడిలో విజయసాయి రెడ్డి పూజలు చేస్తున్నారు. ఇక బీజేపీ కొండ కింద ఆందోళన కొనసాగిస్తోంది.  కాగా ఘటనపై విజయసాయితో పాటు మంత్రులు వెల్లంపల్లి, బొత్స స్పందించారు. ఇదంతా చంద్రబాబు కుట్రగా వారు అభివర్ణించారు. రామతీర్థంలో ఉద్రిక్తత కొనసాగుతోంది.

  • 02 Jan 2021 03:25 PM (IST)

    విజయసాయి కామెంట్స్‌కు లోకేశ్ కౌంటర్

    నారా లోకేశ్ సవాల్‌ను స్వీకరిస్తున్నానంటూ విజయసాయి రెడ్డి ప్రకటించన విషయం తెలిసిందే. అయితే తాను జగన్‌కు  సవాల్ విసిరితే విజయసాయిరెడ్డి ఎందుకు స్పందిస్తున్నారంటూ ప్రశ్నించారు నారా లోకేశ్.  జగన్‌కు దమ్మూ, ధైర్యం లేదా అంటూ ట్వీట్ చేశారు.  దైవం మీద ప్రమాణం అనగానే  చర్చ అంటూ పారిపోతున్నారని పేర్కొన్నారు. ఈ మాటలు వింటుంటే తనపై వైసీపీ చేసే ఆరోపణల్లో ఫేక్ అని అర్థమైపోతుందన్నారు లోకేశ్. తనపై జగన్ చేయిస్తున్న ఆరోపణలు అవాస్తవం అని సింహాద్రి అప్పన్న పై ప్రమాణం చెయ్యడానికి సిద్ధం తాన సిద్దమన్న లోకేశ్..సీఎం కూడా సిద్దమా అని మరోసారి సవాల్ విసిరారు.

  • 02 Jan 2021 03:10 PM (IST)

    మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు : వెల్లంపల్లి

    రామతీర్థంలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నామని..ఈలోపే రాజకీయాలు మొదలెట్టారని మంత్రి ఆరోపించారు. ఇప్పటికే ఆలయ ఈవోను ట్రాన్ఫర్ చేసి..హెడ్ ఆఫీసుకు అటాచ్ చేసినట్లు చెప్పారు. పోలీడ్ ఎంక్వైరీతో పాటు డిపర్టామెంటల్ ఎంక్వైరీ కూడా జరుగుతుందని చెప్పారు. గతంలో కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూసి ఫెయిలయ్యారని..ఇప్పుడు మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని వెల్లంపల్లి ఆరోపించారు.

  • 02 Jan 2021 03:01 PM (IST)

    లోకేశ్ ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ రెడీ : విజయసాయి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలను కూలగొట్టిన చరిత్ర టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదేనని విజయసాయి ఆరోపించారు. తిరుమలతో వేయి కాళ్ల మండపం, విజయవాడలో పెద్ద ఎత్తున గుడిలను కూలగొట్టిన వ్యక్తి చంద్రబాబు అని విజయసాయి ఆరోపించారు. నారా లోకేష్ చెప్పినట్టు తాను చర్చకు సిద్ధమని చెప్పిన విజయసాయి, లోకేశ్ ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు చర్చకు తాను సిద్ధమని అన్నారు. నారా లోకేశ్ స్వయంగా చర్చకు రావాలని విజయసాయి అన్నారు.

  • 02 Jan 2021 02:42 PM (IST)

    లోకేష్ విసిరిన సవాల్ కు ఓకే చెప్పిన విజయసాయి

    రామతీర్థం కొండపై నుంచి కిందికి దిగిన అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయి మీడియాతో మాట్లాడారు. మంచి పరిపాలన అందిస్తున్న జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న పాలనను తప్పుపట్టేవిధంగా టీడీపీ పార్టీకి చెందిన వాళ్లే రామతీర్థంలో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని విజయసాయి ఆరోపించారు. లోకేష్ విసిరిన సవాల్ ను తాను తీసుకుంటున్నానని విజయసాయి అన్నారు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో చర్చకు తాను సిద్ధమని విజయసాయి ప్రకటించారు.

  • 02 Jan 2021 02:36 PM (IST)

    రామతీర్థం కొండపైకి ఎక్కేందుకు చంద్రబాబుకి పోలీస్ అనుమతి

    టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నారు. పోలీసులు అనుమతించరేమోనని మొదట భావించినప్పటికీ చంద్రబాబు కొండ ఎక్కుతుంటే పోలీసులు ఏమాత్రం అడ్డుచెప్పలేదు. దీంతో టీడీపీ శ్రేణులు ఆనందోత్సహాలు వ్యక్తం చేస్తూ కేరింతలు కొట్టారు. దీంతో రామతీర్థం, రణతీర్థంగా మారింది. ఒక పక్క విజయసాయి రెడ్డి, మరోవైపు ఇద్దరి రాకతో ఆ ప్రాంతంమంతా కోలాహలంగా మారింది. కొండపై నుంచి విజయసాయి కిందకి రావడంతో చంద్రబాబుని పైకి ఎక్కేందుకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు.

  • 02 Jan 2021 02:19 PM (IST)

    మహిళలతో మాట్లాడుతోన్న చంద్రబాబు

    కాగా రామతీర్థం విగ్రహ ధ్వంసం ఘటనకు సంబంధించి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి కుటుంబ సభ్యులు చంద్రబాబుకు మొర వినిపించుకుంటున్నారు. అన్యాయంగా తమవారిని అరెస్ట్ చేశారని..న్యాయం జరిగేలా చూడాలని..చంద్రబాబును వారు వేడుకుంటున్నారు. బాబు వారికి భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలంటే లెక్కలేదని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు కొండపైకి వెళ్లేందుకు అనుమతి ఇస్తారా..లేదా అన్న అంశంపై సస్పెన్స్ నెలకుంది.

  • 02 Jan 2021 02:07 PM (IST)

    రామతీర్థం చేరుకున్న చంద్రబాబు

    ఎట్టకేలకు విజయసాయి రామతీర్థం నుంచి వెళ్లిపోయారు. కొంతదూరం నడిచి వెళ్లి ఆపై కారు ఎక్కి వెళ్లిపోయారు విజయసాయి. ఆయన వెళ్లిన వెంటనే చంద్రబాబు రామతీర్థం చేరుకున్నాడు. టెన్షన్ వాతావరణం నెలకొనకుండా సాయి రెడ్డి వెళ్లిన వెంటనే..చంద్రబాబు అక్కడకు వచ్చేందుకు క్లియరెన్స్ ఇచ్చారు పోలీసులు. బాబు రాగానే టీడీపీ కార్యకర్తలు ఎగబడుతున్నారు. దీంతో పోలీసులకు, వారి మధ్య తోపులాట కొనసాగుతోంది.

  • 02 Jan 2021 01:47 PM (IST)

    విజయసాయి రెడ్డి కారుపై రాళ్ల దాడి..పోలీసుల చేజారుతోన్న పరిస్థితి

    రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. మూడు పార్టీల కార్యకర్తలు ఆందోళన చేస్తుండటంతో గందరగోళం నెలకుంది. విజయసాయి రెడ్డి కారుపై రాళ్ల దాడి చేశారు. చెప్పులు కూడా విసిరారు. పరిస్థితి పోలీసులు చేజారిపోతుంది. విజయసాయిని అక్కడ్నుంచి క్షేమంగా పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ వేలాది సంఖ్యలో జన సందేహం అక్కడ ఉండటంతో విజయ సాయి ఇప్పట్లో అక్కడ నుంచి వెళ్తే పరిస్థితి కనిపిస్తోంది.

  • 02 Jan 2021 01:38 PM (IST)

    టీడీపీ కార్యకర్తల ఆందోళన

    చంద్రబాబును రామతీర్థం కొండపైకి అనుమతించాలంటూ టీడీపీ కార్యకర్తుల ఆందోళనకు దిగారు. అయితే విజయ సాయి వెళ్లిన తర్వాతే బాబును అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరుగుతుంది. తోపులాట కూడా జరగుతుంది.

  • 02 Jan 2021 01:30 PM (IST)

    వైసీపీ ధర్మా చేయడం విడ్డూరం : కిమిడి కళా వెంకట్రావు

    స్పాట్‌లో ఉన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు వైసీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని..ప్రభుత్వ చర్యలు శూన్యమన్నారు. చంద్రబాబు పర్యటన ముందుగానే ఫిక్స్ అయ్యిందని..కావాలనే విజయసాయి నేడు పర్యటనకు వచ్చారని వెంకట్రావు ఆరోపించారు. ఎంక్వైరీ చేయించాల్సిన  వ్యక్తులు వచ్చి ధర్మా చేయడం ఆశ్యర్యంగా ఉందన్నారు.

  • 02 Jan 2021 01:19 PM (IST)

    రామతీర్థం ఘటనపై స్పందించిన బొత్స

    ఇక రామతీర్థంలో హైటెన్షన్‌పై మంత్రి బొత్స స్పందించారు. కొంతమంది వ్యక్తుల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే అక్కడ ఈ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. విజయవాడలో ఎన్నో దేవాలయాలు ధ్వంసం చేయించిన చంద్రబాబు..ఇప్పటి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఆ ప్రాంతవాసిగా రామతీర్థంలో జరిగిన ఘటనపై చర్యలు విషయంలో కానీ, టెంపుల్ అభివృద్ది విషయంలో కానీ తాను కృషి చేస్తానని చెప్పారు. తన భార్య ఎంపీగా ఉన్నప్పుడు..ఆలయ అభివృద్ది కోసం ఎంతో కృషి చేశామని చెప్పారు. కొన్ని రోజుల్లో నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

  • 02 Jan 2021 01:12 PM (IST)

    బాబు, విజయసాయి ఎదురుపడతారా..?

    మరికొద్ది నిమిషాల్లో చంద్రబాబు రామతీర్థం చేరుకోనున్నారు. విజయసాయి ఇప్పటికే కొండపైకి వెళ్లి విగ్రహ ధ్వంసం ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. సాయి రెడ్డి అక్కడి నుంచి వెళ్లకముందే బాబు రామతీర్థం చేరుకోనున్నారు. విజయసాయి కొండ దిగి వచ్చే సమయంలో..చంద్రబాబు పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వారిద్దరూ ఎదురుపడితే ఎలా ఉంటుంది అన్న అంశం టెన్షన్‌‌గా మారింది.

  • 02 Jan 2021 01:04 PM (IST)

    కొండపైకి వెళ్తామంటూ బీజేపీ కార్యకర్తల ఆందోళన

    విజయసాయి కొండ ఎక్కితే..తాము కూడా కొండ ఎక్కుతామని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌తో పాటు కార్యకర్తలు శిబిరం నుంచి బయటకు వచ్చి ఆందోళణ చేస్తున్నారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరుగుతుంది.

  • 02 Jan 2021 12:56 PM (IST)

    రామతీర్థంలో గందరగోళం

    వైసీపీ ఎంపీ విజయసాయి 300 మెట్లు ఎక్కి విగ్రహ ధ్వంసం ఘటనను పరిశీలించేసరికి గంట సమయం పట్టే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు కొద్ది క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆయన కాసేపు వెయిట్ చేసి..అక్కడికి చేరుకుంటారా..? లేదా విజయసాయి ఉండగానే అక్కడికి వస్తారా అన్న అంశంపై సస్పెన్స్ నెలకుంది. పోలీసులు ఈ విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే మూడు పార్టీల కార్యకర్తలతో అక్కడ గందరగోళం నెలకుంది.

  • 02 Jan 2021 12:49 PM (IST)

    మరికొద్దిసేపట్లో రామతీర్థానికి చంద్రబాబు

    మరికొద్దిసేపట్లో రామతీర్థానికి టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకోనున్నారు. మరో 15 నిమిషాల్లో బాబు అక్కడికి రానున్నారు. టీడీపీ అధినేత కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. మూడు పార్టీల కార్యకర్తలు మోహరించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

  • 02 Jan 2021 12:41 PM (IST)

    వైసీపీ, బీజేపీ పోటాపోటి నినాదాలు

    రామతీర్థంలో బీజేపీ ఏర్పాటు చేసిన శిబిరం పక్కన విజయసాయి నిల్చున్నారు. దీంతో హైటెన్షన్ నెలుకుంది. పోలీసులు ఇరు వర్గాలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా విజయసాయితో కలిసి కొండ ఎక్కుతున్నారు. వైసీపీ, బీజేపీ శ్రేణులు పోటాపోటి నినాదాాలతో ఉద్రిక్తత నెలకుంది. వైసీపీ కార్యకర్తలు వేలాది మంది కొండపైకి వెళ్తున్నారు. రామనామస్మరణతో కొండ మారుమోగిపోతుంది.

  • 02 Jan 2021 12:37 PM (IST)

    రణరంగంగా రామతీర్థం

    వేలాది మంది వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో రామతీర్థంలో హైటెన్షన్ నెలకుంది. వారిని అడ్డుకోవడం పోలీసులకు కష్టతరంగా మారింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మెట్లపై నుంచి కొండ ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడూ రామనామస్మరణతో మారమోగే రామతీర్థం కొండ..రణరంగాన్ని తలపిస్తోంది.

  • 02 Jan 2021 12:33 PM (IST)

    రామతీర్థం చేరుకున్న విజయసాయి..తీవ్ర ఉద్రిక్తత

    వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థం చేరుకున్నారు. సాయి రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో కొండ వద్ద ఉద్రిక్తత నెలకుంది. కేసులో టీడీపీ కార్యకర్తలను అనుమానితులన్న కారణంతో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారి కుటంబ సభ్యులు వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వాళ్లను పక్కన తీసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకుంది.

  • 02 Jan 2021 12:24 PM (IST)

    కేసులో అదుపులోకి తీసుకున్నవారి కుటుంబీకుల రోదనలు

    విగ్రహ ధ్వంసం  కేసుకు సంబంధించి రామతీర్థం వార్డు మాజీ సభ్యులు సూరిబాబు, రాంబాబుతో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాముడి విగ్రహం ధ్వంసం ఘటనతో సంబంధం లేనివారిని అరెస్టు చేశారని వారి కటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారు కూడా గుడి వద్ద విలపిస్తూ..ఆందోళన నిర్వహిస్తున్నారు.  అరెస్టు చేసిన వారిని వదిలిపెట్టాలని ఎస్పీకి వినతిపత్రం ఇచ్చేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు.

  • 02 Jan 2021 12:18 PM (IST)

    ఛలో రామతీర్థం' నిర్వహించబోతున్నాం : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

    బీజేపీ తరుఫున రాష్ట్రవ్యాప్తంగా 'ఛలో రామతీర్థం' కార్యక్రమం నిర్వహించబోతున్నామని..తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు 4 వ తేదీన రామతీర్థం రాబోతున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చెప్పారు. హిందూ ధార్మిక సంస్థలతో కలిసి..హిందూ దేవాలయాల పరిరక్షణకు ఉద్యమిస్తామన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగే వరకు పోరాటం సాగిస్తామని చేప్పారు.  బీజేపీ నిరసన కార్యక్రమం కొనసాగుతోంది.

  • 02 Jan 2021 12:13 PM (IST)

    సీఎం కనీసం విచారణ వ్యక్తం చేయకపోవడం దారుణం : ఎమ్మెల్సీ మాధవ్

    దోషులను పట్టుకుంటామని చెప్పాల్సిన ముఖ్యమంత్రి..ఘటనపై పెద్దగా స్పందించకపోవడం దారుణమన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. రాష్ట్ర వ్యాప్తంగా రామ భక్తుల మనోభావాలు దెబ్బతిన్న పక్షంలో..ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేయకపోవడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అసలు కనిపించడలేదని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండకడుతూ..మున్ముందు ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని బీజేపీ ఎమ్మోల్సీ మాధవ్ హెచ్చరించారు.

  • 02 Jan 2021 12:08 PM (IST)

    చంద్రబాబు రామతీర్థం రావడం విడ్డూరంగా ఉంది : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

    టీడీపీ అధినేత రామతీర్థం పర్యటనకు వస్తుండటంపై కూడా మాధవ్ స్పందించారు. గతంలో టీడీపీ కూడా హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడిందని చెప్పారు. టీడీపీ హయాంలో 30 ఆలయాలు ధ్వంసం చేశారని..అటువంటి చంద్రబాబు నేడు రామతార్థం రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక వైసీపీ 21 దేవాలయాల్లో ఈ తరహా ఘటనలు జరిగితే..ఒక్క విషయంలో కూడా దుండగులను అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు.

  • 02 Jan 2021 12:04 PM (IST)

    వరుసగా దాడులు జరుగుతున్నా..ప్రభుత్వం నుంచి స్పందన లేదు : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

    విగ్రహ ధ్వంసం జరిగిన విషయం తెలిసిన వెంటనే..తమ పార్టీ నాయకులు వెళ్లి పరిశీలించారని..దుండగులు వ్యూహాత్మకంగా ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. వెంటనే తాము నిరసనలకు దిగి..ప్రభుత్వ స్పందన కోరామని.. కనీసం దేవాదాయ శాఖ మంత్రి వచ్చి కూడా పరిశీలించలేదని పేర్కొన్నారు. వరసగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నా..ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని చెప్పారు.

  • 02 Jan 2021 11:52 AM (IST)

    రామ కీర్తనలతో మారుమోగిపోతున్న రామతీర్థం

    రాముడి కీర్తనలతో రామతీర్థం మారుమోగిపోతుంది. ముందు జాగ్రత్తగా కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. రామతీర్థానికి భారీగా వైసీపీ, టీడీపీ, బీజేపీ శ్రేణులు చేరుకుంటున్నాయి. మూడు పార్టీల నేతల రాకతో పరిస్థితి గందరగోళంగా మారింది.

Published On - Jan 02,2021 4:14 PM

Follow us
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం