వ్యాక్సిన్… డిసెంబర్ 31 కల్లా 30 కోట్ల డోసులు రెడీ..
కరోనా వ్యాక్సిన్ విషయంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ భారతీయులకు గుడ్ న్యూస్ అందించింది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరి కల్లా భారత్‌లో
Covid Vaccine Doses: కరోనా వ్యాక్సిన్ విషయంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ భారతీయులకు గుడ్ న్యూస్ అందించింది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరి కల్లా భారత్‌లో దాదాపు 30 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు సిద్దమవుతాయని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ జాదవ్ చెప్పారు. డీసీజీఐ నుంచి లైసెన్స్ రాగానే వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందుతున్నాయన్నారు.
ప్రస్తుతం సీరమ్ సంస్థ ఐదు రకాల వ్యాక్సిన్లపై ప్రయోగాలు చేస్తోంది. అలాగే ఈ సంస్థ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ చివరి పరీక్ష జరుపుకుని 2021 మార్చిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని అనుమతులు పొందిన తర్వాత ఆ వ్యాక్సిన్‌ను విక్రయిస్తామని.. నెలకు 7 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేస్తామని చెప్పారు.
Also Read: వాళ్లకే తొలి దశ కరోనా వ్యాక్సిన్: కేంద్రం