ఒకేరోజు రికార్డుస్థాయిలో కరోనా కేసులు.. ప్రపంచ రెండో స్థానంలో భారత్

కరోనా వైరస్ కరాళ నృత్యానికి దేశం విలవిలలాడుతోంది. ప్ర‌తిరోజు వేలాది కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. అత్య‌ధిక కేసుల‌తో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌ను భార‌త్ వెన‌క్కి నెట్టేసింది. నిన్న 90,600 కేసులు న‌మోద‌వ‌గా, ఈరోజు దానికి మించి రెండు వంద‌ల కేసులు అధికంగా న‌మోద‌య్యాయి. దీంతో ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే క‌రోనా కేసులు 42 ల‌క్ష‌ల మార్కును దాటేసింది.

ఒకేరోజు రికార్డుస్థాయిలో కరోనా కేసులు.. ప్రపంచ రెండో స్థానంలో భారత్
Balaraju Goud

|

Sep 07, 2020 | 10:35 AM

కరోనా వైరస్ కరాళ నృత్యానికి దేశం విలవిలలాడుతోంది. ప్ర‌తిరోజు వేలాది కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. అత్య‌ధిక కేసుల‌తో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌ను భార‌త్ వెన‌క్కి నెట్టేసింది. నిన్న 90,600 కేసులు న‌మోద‌వ‌గా, ఈరోజు దానికి మించి రెండు వంద‌ల కేసులు అధికంగా న‌మోద‌య్యాయి. దీంతో ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే క‌రోనా కేసులు 42 ల‌క్ష‌ల మార్కును దాటేసింది.

దేశంలో మ‌రోసారి అత్య‌ధిక కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ వ్యవధిలో 90,802 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 42,04,614కు చేరుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 8,82,542 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, మ‌రో 32,50,429 మంది క‌రోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. క‌రోనా వైర‌స్ బారిన పడి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 71,642 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నిన్న ఉద‌యం నుంచి ఈ రోజు ఉద‌యం వ‌ర‌కు మ‌రో 1,016 మంది బాధితులు మృతిచెందార‌ని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది.

సెప్టెంబ‌ర్ 6 వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 4,95,51,507 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎంఆర్‌) ప్ర‌కటించింది. నిన్న ఒక్క‌రోజే 7,20,362 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని తెలిపింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu