AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై పెట్రోల్‌ బంకుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌లు

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని (ఈవీ) వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించే దిశగా దాదాపు 69,000 పెట్రోల్‌ బంకుల్లో కనీసం ఒక చార్జింగ్‌ కియోస్క్‌ అయినా ఏర్పాటు చేయాలన్న

ఇకపై పెట్రోల్‌ బంకుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌లు
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 07, 2020 | 10:47 AM

Share

Electric Vehicle Charging: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని (ఈవీ) వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించే దిశగా దాదాపు 69,000 పెట్రోల్‌ బంకుల్లో కనీసం ఒక చార్జింగ్‌ కియోస్క్‌ అయినా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది. దీంతో పాటు ప్రభుత్వ రంగ రిఫైనర్లకు చెందిన బంకుల్లో(సీవోసీవో) ఈవీ చార్జింగ్‌ కియోస్క్‌ల ఏర్పాటును తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ఈవీ చార్జింగ్‌ మౌలిక సదుపాయాలపై జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు చమురు శాఖ వర్గాలకు, కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ సూచనలు చేశారు.

చమురు మార్కెటింగ్‌ కంపెనీలు తమ నిర్వహణలోని అన్ని సీవోసీవో బంకుల్లో ఛార్జింగ్‌ కియోస్క్‌లను పెట్టే విధంగా చమురు శాఖ ఆదేశాలు జారీచేయొచ్చని ఆయన సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే ఫ్రాంచైజీ ఆపరేటర్లు కూడా తమ బంకుల్లో కనీసం ఒక్కటైనా ఛార్జింగ్‌ కియోస్క్‌ పెట్టేలా ఆదేశాలను ఇస్తే మంచిదని మంత్రి చెప్పినట్లు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యం సాధ్యమవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నగరాలు, జాతీయ రహదారుల్లో ఈవీ చార్జింగ్‌ ఇన్‌ఫ్రాను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించవచ్చని తెలిపాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, వడోదర, భోపాల్‌ వంటి నగరాలపై చమురు శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,802 కొత్త కేసులు.. 9 మరణాలు

కీర్తి ‘గుడ్‌లక్‌ సఖి’ షూటింగ్‌ పూర్తి

Follow Us
గౌహతీ వన్డేలో అదరగొట్టిన రోహిత్.. సెంచరీతో చెలరేగిన హిట్‌మ్యాన్!
గౌహతీ వన్డేలో అదరగొట్టిన రోహిత్.. సెంచరీతో చెలరేగిన హిట్‌మ్యాన్!
తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ అగర్వాల్ కాంట్రవర్సీ మూవీ
తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ అగర్వాల్ కాంట్రవర్సీ మూవీ
అక్టోబర్ నెలలో ఈ రాశుల వారు నోరు తెరిస్తే కష్టాలే!
అక్టోబర్ నెలలో ఈ రాశుల వారు నోరు తెరిస్తే కష్టాలే!
టికెట్ ఉంటే సరిపోదు.. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఇది తప్పనిసరి..
టికెట్ ఉంటే సరిపోదు.. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఇది తప్పనిసరి..
ఇండస్ట్రీలో తనకున్న ఏకైక మిత్రుడు ఆయనే..
ఇండస్ట్రీలో తనకున్న ఏకైక మిత్రుడు ఆయనే..
బ్యాక్ టు బ్యాక్ సెంచరీతో విరుచుకుపడ్డ భారత కెప్టెన్
బ్యాక్ టు బ్యాక్ సెంచరీతో విరుచుకుపడ్డ భారత కెప్టెన్
తిరుమలలో ఈ దర్శనాల గురించి మీకెవరూ చెప్పరు.. ఎన్ని మార్గాలంటే
తిరుమలలో ఈ దర్శనాల గురించి మీకెవరూ చెప్పరు.. ఎన్ని మార్గాలంటే
ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా.
ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా.
కరెంట్ లేకపోయినా ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు.. 5 ట్రిక్స్..
కరెంట్ లేకపోయినా ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు.. 5 ట్రిక్స్..
నూనె పీల్చకుండా అదిరిపోయే బలవర్ధకమైన ఉలవ వడలు
నూనె పీల్చకుండా అదిరిపోయే బలవర్ధకమైన ఉలవ వడలు