కరోనా వీరవిహారం: 64,553 కేసులు, 1007 మరణాలు
దేశంలో కొవిడ్ వైరస్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 64,553 మంది వైరస్ బారినపడ్డారు. ఫలితంగా దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 24లక్షల 61వేల 191కి చేరింది.
India Corona Cases : దేశంలో కొవిడ్ వైరస్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 64,553 మంది వైరస్ బారినపడ్డారు. ఫలితంగా దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 24లక్షల 61వేల 191కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2 కోట్ల 76 లక్షల 94 వేల కోవిడ్ టెస్టులు నిర్వహించారు. కొత్తగా 1,007 మంది కరోనా కారణంగా మరణించారు.
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో కరోనా వివరాలు
ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 24,61,190 ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 17,51,555 ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 48,040 ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 6,61,595
మరోవైపు రికవరీల సంఖ్య పెరగడం ఊరట కలిగించే అంశం. మొత్తం బాధితుల్లో 71.17 శాతం మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. అదే క్రమంలో మరణాల రేటు కూడా తగ్గింది. తాజాగా ఈ రేటు 1.95 శాతానికి పడిపోయింది. గురువారం ఒక్కరోజే 8,48,728 శాంపిల్స్ టెస్టు చేసినట్టు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఫలితంగా మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 2,76,94,416కు చేరింది.
Also Read : బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు
Also Read : అంతులేని విషాదం : కరోనాతో ఒకే కుటుంబంలో ఐదుగురు మరణం