దంతేవాడలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

ఛత్తీస్‌గఢ్‌లో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. దంతేవాడ జిల్లాలో గురువారం నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. జిల్లాఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ సమక్షంలో పదహారు మంది మావోయిస్టులు..

దంతేవాడలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 14, 2020 | 10:50 AM

ఛత్తీస్‌గఢ్‌లో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. దంతేవాడ జిల్లాలో గురువారం నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. జిల్లాఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ సమక్షంలో పదహారు మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురి తలలపై భారీగా రివార్డు ఉన్నట్లు తెలిపారు. పట్టుబడ్డ వారిలో బస్తర్‌ జిల్లా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ముగ్గురు కమాండర్‌ లెవల్‌లో బాధ్యతతో ఉన్నవారని.. వీరిపై పలు కేసులు కూడా ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు. మరికొందరిపై రైల్వే ట్రాక్‌లను ధ్వంసం చేసిన ఘటనలపై నిందితులుగా ఉన్నారన్నారు. మరికొందరు గ్రామ పంచాయితీ సభ్యులతో పాటు గ్రామస్థులను చంపిన ఆరోపణలు ఉన్నాయన్నారు.