India Corona Cases: దేశ ప్రజలకు కాస్త ఊరట.. తగ్గిన పాజిటివ్ కేసులు, 500 దిగువకు మరణాలు..

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోలిస్తే పాజిటివ్ కేసులు, మరణాలు మరోసారి తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా..

India Corona Cases: దేశ ప్రజలకు కాస్త ఊరట.. తగ్గిన పాజిటివ్ కేసులు, 500 దిగువకు మరణాలు..
India Corona Updates
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 23, 2021 | 10:15 AM

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోలిస్తే పాజిటివ్ కేసులు, మరణాలు మరోసారి తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 35,342 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,12,93,062కి చేరింది. ఇందులో 4,05,513 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కొత్తగా 38,740 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 3,04,68,079కి చేరింది.

అటు నిన్న 483 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 4,19,470 చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా 42,34,17,030 వ్యాక్సినేషన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అటు థర్డ్ వేవ్ టెన్షన్, కరోనా కొత్త వేరియంట్లు మళ్లీ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తగిన చర్యలు తీసుకోకపోతే కరోనా థర్డ్ వేవ్ తప్పదని వైద్యులు హెచ్చరిస్తుండటంతో కేంద్రం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. (India Corona Cases)

Also Read:

ఓర్నీ దుంపతెగ.! పులికి ఎదురెళ్లి ‘హలో బ్రదర్’ చెప్పాడు.. క్రేజీ వీడియో వైరల్..

వాహనదారులకు గుడ్ న్యూస్.. దేశంలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.! వివరాలివే..

ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‌‌ ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా.!

బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే అదిరిపోయే బైకులు.. 84 కిలోమీటర్ల మైలేజ్.!