Green Oasis: నీటి చుక్కలేని ఏడాదిలోని కోటను బృందావనంగా మార్చిన ఈ టీచర్.. కొడుకుని పోగొట్టుకున్నా మొక్కల పెంపకమే అతని జీవితం

Green Oasis in rajasthan: కృషి, పట్టుదల ఉంటే మనిషి సాధించడలేనిది ఏమీ లేదు. అంబరాన్ని అందుకున్నాడు.. సముద్రాలను శోధిస్తున్నాడు.. సృష్టి రహస్యాన్ని చెందించే దిశగా ఆలోచిస్తున్నాడు...

Green Oasis: నీటి చుక్కలేని ఏడాదిలోని కోటను బృందావనంగా మార్చిన ఈ టీచర్.. కొడుకుని పోగొట్టుకున్నా మొక్కల పెంపకమే అతని జీవితం
Green Oasis
Follow us
Surya Kala

|

Updated on: Jul 22, 2021 | 5:30 PM

Green Oasis in rajasthan: కృషి, పట్టుదల ఉంటే మనిషి సాధించడలేనిది ఏమీ లేదు. అంబరాన్ని అందుకున్నాడు.. సముద్రాలను శోధిస్తున్నాడు.. సృష్టి రహస్యాన్ని చెందించే దిశగా ఆలోచిస్తున్నాడు..ఎడారిని సైతం అందమైన బృందావనంలా తయారు చేస్తున్నారు. ఇసుకనుంచి తైలం తీయవచ్చు అని నిరూపిస్తున్నాడు.. తాజాగా థార్ ఎడారిని ఆనుకుని ఉన్న ఓ కోట పరిసర ప్రాంతాలు ఇప్పుడు పచ్చదనంతో నిండిపోయింది.. ఒకప్పుడు బంజరు భూమిని తలపించిన ప్రాంతం ఇప్పుడు ప్రకృతి అందాలతో అలరారుతుంది. దీని వెనుక ఒక టీచర్ కృషి ఉంది.. వివరాల్లోకి వెళ్తే.

రాజస్థాన్‌ థార్ ఎడారి తో చారిత్రిక ప్రదేశాలకు, కోటలకు ప్రసిద్ధి. ఇక వారసత్వ కష్టాలకు కూడా అనేకం.. వాటిల్లో ఒకటి జోధ్ పూర్ కి దగ్గరలో ఉన్న మెహ్రంగర్ కోట. ఒకప్పుడు ఈ కోట బంజరు భూమిలా ఉండేది..ఇప్పుడు ఈ కోట వేలాది చెట్లు, వందల రకాల పక్షి జాతులతో స్థానిక వన్యప్రాణులకు నిలయంగా మారింది. ఈరోజు అందమైన సుందర ప్రాంతంగా మారడానికి ప్రసన్నపురి గోస్వామి అనే టీచర్ 32 ఏళ్ల క్రితం కన్న కల.. ఆయన చేసిన కృషికి ఫలితం.. నేడు కోట చుట్టుపక్కల గల 22 హెక్టార్ల విస్తీర్ణం 50 వేల చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతోంది.

74ఏళ్ల ప్రసన్నపురి గోస్వామి మెహ్రంగర్ కోట దగ్గర్లోని ఖేజ్రి చౌక్‌ నివాసి. ఆయన చిన్నతనంలో కోట చుట్టూ.. పచ్చని చెట్లు.. అందమైన ప్రకృతి ఉంటుందని.. దీంతో కోట చాలా అద్భుతంగా కనిపిస్తుందని అనుకునేవాడు. ఈ నేపథ్యంలో గోస్వామి మెహ్రంగర్ కోట కు సమీపంలోని ఒక పాఠశాల్లో టీచర్ గా ఉద్యోగం వచ్చింది. అప్పుడు కోట పరిస్థితిని చూశాడు.. ఎలాగైనా కోట, పరిసర ప్రాంతలను పచ్చదనంతో నింపాలను భావించారు.. దీంతో పాఠశాల అయిపోయిన తర్వాత జశ్వంత్-తడ మధ్యన, మెహ్రంగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొక్కలను నాటేవారు.

ఏడారి ప్రాంతంలో వర్షపాతం తక్కువ కనుక మొక్కలు బతకడం కష్టమని గోస్వామి కొద్దికాలంలోనే తెలుసుకున్నాడు. అయినప్పటికీ తన సంకల్పాని వదలలేదు.. ఏ పరిస్థితుల్లోనైనా సరే మొక్కలను సంరక్షించాలనుకున్నాడు.. ఇదే సమయంలో గోస్వామి చేస్తున్న పని రాయల్ ఫ్యామిలీ దృష్టికి వచ్చింది దీంతో ‘మహారాజ గజ్ సింగ్’ గోస్వామి మొక్కలు నటి సంరక్షిస్తున్న విధానం నచ్చి ఆయనకు మరో ఇద్దరు సహాయకులను ఏర్పాటు చేశారు.

మరోవవైపు జిల్లా అధికారులు కూడా స్పందించారు.. 1995లో మొక్కలను సంరక్షించేందుకు 22 హెక్టార్ల చుట్టూ ఫెన్సింగ్ వేయించింది. గోస్వామి, దీక్షకు ప్రభుత్వం ప్రజల సహకారం మొదలయ్యుయింది. దీంతో మొక్కల సంరక్షణ చర్యలతో వందలాది మొక్కలు ఇప్పుడు భారీ వృక్షాలుగా పెరిగాయి. ప్రసన్నపురి గోస్వామినుంచి స్ఫూర్తి పొందిన స్తానికులు, విద్యార్థులు ముందుకొచ్చారు. ఈ క్రమంలో ‘మెహ్రంగర్ పహాడి పర్యావరణ్ వికాస్ సమితి’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి పచ్చదనం కోసం పాటుపడడం మొదలు పెట్టారు.

ముఖ్యంగా నీటి ఎద్దడిని తట్టుకునే ముళ్ల చెట్లు, గుబురు మొక్కలను పెంచడం మొదలు పెట్టారు. కొండప్రాంతాల్లో నీటి సదుపాయం లేకపోవడంతో సమీపంలోని ప్రదేశాల నుంచి సరఫరా చేయాల్సి వచ్చేది. ఇక వేసవిలో అయితే బాటిళ్లలో తీసుకెళ్లి చెట్లకు నీరు పోసేవారు.. మొదట్లో ప్రసన్నపురి ప్రయత్నాలను కొంతమంది ఎద్దేవా చేశారు.. అయినప్పటికీ వాటిని పట్టించుకోలేదు. ఒకానొక సందర్భంలో ప్రసన్నపురి ప్రయత్నాలకు అడ్డుపడాలని కొందరు రాత్రికిరాత్రే 200 మొక్కలను పీకేశారు.

మరికొందరు మేము తాగునీటి కోసం అవస్థలు పడుతుంటే.. చెట్ల కోసం నీళ్లు వృథా చేస్తున్నావని ప్రశ్నించేవారు. అలా ఎన్నో అడ్డంకులు దాటుకుని ప్రస్తుతం తన కలను నెరవేర్చుకున్నారు ప్రసన్నపురి. ఈ క్రమంలో 2005లో ప్రసన్నపురి జాలోర్ జిల్లాకు ట్రాన్స్‌ఫర్ కావడంతో మొక్కల బాధ్యతను తన కొడుకుకు అప్పగించాడు.

తండ్రి భాద్యతను నెరవేర్చేక్రమంలో ఒకరోజు మొక్కలకు పెస్టిసైడ్స్ కొడుతూ.. స్పృహతప్పి పడిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ… రెండు రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనతో ఆయనలో పర్యావరణం పట్ల మరింత జాగ్రత్తగా ఉండేలా చేసింది. ఆ కోట చుట్టూ ఉన్న కొన్ని మొక్కలు ప్రసన్నపురి కొడుకు వయసు ఉంది.. ఆ మొక్కలో కొడుకుని చూసుకుంటూ.. మొక్కలను తన పిల్లల వలెనే చూసుకుంటున్నాడు ప్రసన్నపురి.

ప్రసన్నపురి కృషి పట్టుదలతో మెహ్రంగర్ కోట పరిసర ప్రాంతాలు మినీ అడవిని తలపిస్తుంది. ఇక్కడ సుమారు 195 జాతులు పక్షులు నివసిస్తున్నాయి. అంతేకాదు అనేక రకాలైన జంతువులు ముళ్ల పందులు, పందికొక్కులు, గుడ్లగూబలు, కుందేళ్లు తదితర వన్యప్రాణులకు నివాసంగా మారింది. ఇక ఈ అడవిలో 130 రకాల ఔషధ మూలికలు, వందల పండ్ల చెట్లు కూడా ఉన్నాయి.

Also Read:  కడుపు ఉబ్బరానికి దివ్య ఔషధం సామలు.. ఈరోజు సామలు టమాటా రైస్ తయారీ విధానం తెలుసుకుందాం