ICC Champions Trophy : అఫీషియల్.. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

ఎట్టకేలక ఛాంపియన్స్ ట్రోఫీ-2025 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఫిబ్రవరి 19 నుండి కరాచీలో న్యూజిలాండ్ వర్సెస్ ఆతిథ్య పాకిస్తాన్‌ల మధ్య మొదటి మ్యాచ్‌తో ఈ మినీ వరల్డ్ కప్ వార్ ప్రారంభమవుతుంది. మార్చి 9న ఫైనల్ జరగనుంది. టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది

ICC Champions Trophy : అఫీషియల్.. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ICC Champions Trophy 2025
Follow us
Basha Shek

|

Updated on: Dec 24, 2024 | 6:26 PM

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. మినీ వరల్డ్ కప్ గా భావించే ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోపీ షెడ్యూల్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం (డిసెంబర్ 24) ప్రకటించింది. ఈ మేరకు ఐసీసీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. నిజానికి ఈ టోర్నీ షెడ్యూల్ ఇప్పటికే విడుదలై ఉండాల్సింది.  కానీ టోర్నీ నిర్వహణ విషయంలో భారత్, ఆతిథ్య పాకిస్థాన్ మధ్య నెలకొన్న గందరగోళం కారణంగా ఈ షెడ్యూల్ విడుదల కాలేదు. ఎట్టకేలకు ఈ రెండు దేశాల డిమాండ్లను పరిగణణలోకి తీసుకున్న ఐసీసీ మంగళవారం టోర్నీ అధికారిక షెడ్యూల్ ను రిలీజ్ చేసింది .ఈ టోర్నీలో ఫైనల్‌తో కలిపి మొత్తం 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 8 జట్లు ఈ టోర్నీలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి. ఈ 8 జట్లను 4-4 ప్రకారం 2 గ్రూపులుగా విభజించారు. ICC విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్ న్యూజిలాండ్, ఆతిథ్య పాకిస్తాన్ జట్ల మధ్య కరాచీ వేదికగా జరుగుతుంది. మార్చి 9న ఫైనల్ జరగనుంది. టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఇక టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 23న దుబాయ్‌ వేదికగా భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య హైవోల్టేజీ మ్యాచ్ జరగనుంది. లీగ్ రౌండ్‌లో చివరి మ్యాచ్‌లో భారత్ మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది.

ఐసీసీ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం..

  • ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, గ్రూప్ బీలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ ఉన్నాయి.
  • భారత జట్టు తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఒకవేళ రోహిత్ సేన ఫైనల్‌కు చేరితే అది కూడా లాహోర్‌లో కాకుండా దుబాయ్‌లో జరుగుతుంది.
  • ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు రిజర్వ్ డేని నిర్ణయించారు. మార్చి 9న ఫైనల్ జరగకపోతే మార్చి 10న మ్యాచ్ జరగనుంది.
  •  అయితే ఛాంపియన్స్ ట్రోఫీ  సెమీ-ఫైనల్ కు రిజర్వ్ డే లేదు.
  • అన్ని ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి.
ఇవి కూడా చదవండి

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్..

టీమిండియా మ్యాచ్ ల వివరాలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే