Fisheries Ministry: ‘మత్స్య మంత్రిత్వ శాఖ” కామెంట్.. రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ.!

Fisheries Ministry: కేరళలోని కొల్లాం జిల్లా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు...

Fisheries Ministry: 'మత్స్య మంత్రిత్వ శాఖ'' కామెంట్.. రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ.!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 25, 2021 | 1:49 PM

Fisheries Ministry: కేరళలోని కొల్లాం జిల్లా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలో రైతుల కోసం ఓ మంత్రిత్వ శాఖ ఉందని.. కానీ మత్స్యకారులకు సెపరేట్‌గా ఓ మంత్రిత్వ శాఖ లేదంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రధాని మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

”మత్స్య మంత్రిత్వ శాఖను ప్రారంభించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్న వ్యాఖ్యలకు పూర్తిగా షాక్ తిన్నాను. నిజం చెప్పాలంటే.. ఆ శాఖ ఎప్పటినుంచో కేంద్ర ప్రభుత్వంలో ఉంది. 2019లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే మత్స్య మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు”

కాగా, ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుదుచ్చేరి పర్యటనలో ఉన్నారు. అక్కడ పలు డెవలప్మెంట్ ప్రాజెక్టులకు ఆయన ప్రారంభించనున్నారు. ఏప్రిల్-మే నెలలో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మోదీ పుదుచ్చేరి అంతటా విస్తృతంగా పర్యటించడానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఓ పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ”ఒక్కప్పుడు బ్రిటిష్ వాళ్లు దేశాన్ని విభజించు.. పాలించు.. అన్న సిద్దాంతంతో నెట్టుకురాగా.. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్లు అబద్దాలు, పాలనా అనే థియరీతో ముందుకు సాగారని దుయ్యబట్టారు. ఒక్కోసారి ఆ పార్టీ నాయకులూ ప్రాంతానికి, ప్రాంతానికి, సామాజిక వర్గాలకు మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించి.. చేసిన పలు కీలక వ్యాఖ్యలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, ఇతర బీజేపీ నేతలు కూడా ఈ విధమైన మంత్రిత్వ శాఖ ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!

Fight With Cheetah: చావు తప్పదనుకుని.. చిరుతతో ఫైట్‌ చేసిన రియల్‌ హీరో.. చివరికి ఏమైందంటే.!

ఈ వింత షార్క్ పిల్ల.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌ అట.! నిజంగానే కోట్లు తెచ్చిపెడుతుందా.?

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..