AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Metro Train: హైదరాబాద్ మెట్రో రైలు సమయం పెంపు.. నేటి నుంచి రాత్రి 10గంటల వరకు పరుగులు

తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా లాక్‌డౌన్ ఎత్తివేశారు. దీంతో హైదారాబాద్ నగరంలో ప్రజా రవాణ వ్యవస్థ షురూ చేసేందుకు అధికారులు పరుగులు పెట్టిస్తున్నారు.

Hyderabad Metro Train: హైదరాబాద్ మెట్రో రైలు సమయం పెంపు.. నేటి నుంచి రాత్రి 10గంటల వరకు పరుగులు
Hyderabad Metro Timings
Balaraju Goud
|

Updated on: Jun 21, 2021 | 7:23 AM

Share

Hyderabad Metro Train Timings: తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా లాక్‌డౌన్ ఎత్తివేశారు. దీంతో హైదారాబాద్ నగరంలో ప్రజా రవాణ వ్యవస్థ షురూ చేసేందుకు అధికారులు పరుగులు పెట్టిస్తున్నారు. ఇదే క్రమంలో మెట్రో రైలు సర్వీసుల్లో అధికారులు మార్పులు చేశారు. మెట్రో రైలు సేవలను అధికారులు పూర్తి స్ధాయిలో అందుబాటులోకి వచ్చాయి. నగరంలో మెట్రో రైలు సర్వీసుల్లో అధికారులు మార్పులు చేశారు. నేటి ఉదయం 7గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు.

మెట్రో సమయాల్లో మార్పులతో నిత్యం లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. లాక్‌డౌన్‌లో సమయంలో సమయం కుదించినప్పటికీ ప్రతిరోజు పది వేలమంది ప్రయాణం చేశారు. గత ఏడాది లాక్‌డౌన్‌కి ముందు 4.5లక్షల మంది మెట్రో ప్రయాణం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఉదయం 7 గంటలకు మొదటి ట్రైన్‌, చివరి స్టేషన్‌ నుంచి రాత్రి 9 గంటలకు రైలు బయలుదేరుతుంది. ఆఖరి రైలు రాత్రి 10 గంటలకు నాగోలు చేరుకుంటుందని మెట్రో అధికారులు తెలిపారు. మెట్రోలో ప్రయాణించే వారు తప్పని సరిగా మాస్క్ లు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ,శానిటైజర్ ఉపయోగించాలని మెట్రో అధికారులు కోరారు. మారిన సమయాలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు.

Read Also….  CM KCR Tour: ఇవాళ వరంగల్‌, యాదాద్రి పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం