AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మె ఎఫెక్ట్‌తో.. మెట్రో ఖాతాలో మరో రికార్డ్..!

ఆర్టీసీ సమ్మె కారణంగా మెట్రో జోరందుకుంది. సోమవారం 3.80 లక్షల మంది ప్రయాణికులతో రికార్డు బద్దలు కొట్టింది. ఇటీవల 3.75 లక్షల మందితో రికార్డు బ్రేక్ చేయగా.. సోమవారం రద్దీ ఎక్కువగా ఉండటంతో 3.80లక్షలకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెజార్టీ సిటిజనులు మెట్రోలోనే ప్రయాణిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు పలు రూట్లలో మెట్రో రైళ్లు రద్దీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎల్బీనగర్-మియాపూర్ రూట్లో‌ని ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి, అమీర్‌పేట్, […]

సమ్మె ఎఫెక్ట్‌తో.. మెట్రో ఖాతాలో మరో రికార్డ్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 15, 2019 | 11:43 AM

Share

ఆర్టీసీ సమ్మె కారణంగా మెట్రో జోరందుకుంది. సోమవారం 3.80 లక్షల మంది ప్రయాణికులతో రికార్డు బద్దలు కొట్టింది. ఇటీవల 3.75 లక్షల మందితో రికార్డు బ్రేక్ చేయగా.. సోమవారం రద్దీ ఎక్కువగా ఉండటంతో 3.80లక్షలకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెజార్టీ సిటిజనులు మెట్రోలోనే ప్రయాణిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు పలు రూట్లలో మెట్రో రైళ్లు రద్దీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎల్బీనగర్-మియాపూర్ రూట్లో‌ని ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి, అమీర్‌పేట్, మియాపూర్ స్టేషన్లలో రద్దీ అనూహ్యంగా పెరిగిందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇక నాగోల్ టు హైటెక్ సిటీ రూట్‌లో నాగోల్, ఉప్పల్, తార్నాక, మెట్టుగూడా, సికింద్రాబాద్, బేగంపేట్, హైటెక్ సిటీ స్టేషన్లు రికార్డు సంఖ్యలో ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయని మెట్రో అధికారులు చెబుతున్నారు. మామూలు రోజులతో పోలిస్తే.. సోమవారం ఎక్కువ సంఖ్యలో సిటిజన్లు మెట్రోలో ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది. గత వారం రోజులకు పైగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. పలు స్టేషన్లలో ప్రత్యేక టికెట్ కౌంటర్లు, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు.

Follow Us
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!