లండన్‌లో హైదరాబాదీ దారుణ హత్య.. చంపేసిన పాకిస్తానీ

హైదరాబాద్‌కు చెందిన నదీముద్దీన్ అనే యువకుడు లండన్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. ఓ మాల్‌లో ఉద్యోగం చేస్తున్న నదీమ్‌ను.. సహ ఉద్యోగి అయిన పాకిస్తానీ హత్య చేశాడని అతడి తండ్రి ఆరోపిస్తున్నారు. కాగా పాతబస్తీలోని నూర్‌ఖాన్ బజార్‌కు చెందిన నదీమ్ ఆరేళ్లుగా లండన్‌లో నివసిస్తున్నాడు. ఇటీవల మాల్ మూసివేసిన తర్వాత కూడా నదీమ్ ఇంటికి చేరుకోకపోవడంతో.. అతని భార్య మాల్ నిర్వాహకులకు ఫోన్ చేసింది. దీంతో సెక్యురిటీతో మాల్ నిర్వాహకులు అంతా వెతికించగా.. వారికి నదీమ్ డెడ్‌బాడీ […]

లండన్‌లో హైదరాబాదీ దారుణ హత్య.. చంపేసిన పాకిస్తానీ
Follow us

| Edited By:

Updated on: May 10, 2019 | 12:50 PM

హైదరాబాద్‌కు చెందిన నదీముద్దీన్ అనే యువకుడు లండన్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. ఓ మాల్‌లో ఉద్యోగం చేస్తున్న నదీమ్‌ను.. సహ ఉద్యోగి అయిన పాకిస్తానీ హత్య చేశాడని అతడి తండ్రి ఆరోపిస్తున్నారు. కాగా పాతబస్తీలోని నూర్‌ఖాన్ బజార్‌కు చెందిన నదీమ్ ఆరేళ్లుగా లండన్‌లో నివసిస్తున్నాడు. ఇటీవల మాల్ మూసివేసిన తర్వాత కూడా నదీమ్ ఇంటికి చేరుకోకపోవడంతో.. అతని భార్య మాల్ నిర్వాహకులకు ఫోన్ చేసింది. దీంతో సెక్యురిటీతో మాల్ నిర్వాహకులు అంతా వెతికించగా.. వారికి నదీమ్ డెడ్‌బాడీ కారు పార్కింగ్ ప్రదేశంలో కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.