తెలంగాణ ఎక్సైజ్ అధికారులకు శుభవార్త.. ఎట్టకేలకు ప్రమోషన్లు కల్పిస్తూ సీఎస్ కీలక ఉత్తర్వులు జారీ..!

తెలంగాణ ఎక్సైజ్ అధికారులకు శుభవార్త.. ఎట్టకేలకు ప్రమోషన్లు కల్పిస్తూ సీఎస్ కీలక ఉత్తర్వులు జారీ..!

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎక్సైజ్‌ అధికారులకు ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది.

Balaraju Goud

|

Jan 20, 2021 | 6:15 PM

Huge promotions excise dept.: తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎక్సైజ్‌ అధికారులకు ఎట్టకేలకు పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో మొత్తంగా 80 మంది అధికారులు పదోన్నతులు పొందారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ నీతూ ప్రసాద్‌, ఎక్సైజ్‌ డైరెక్టర్‌ సర్ఫ్‌రాజ్‌ అహ్మద్‌లతో కూడిన డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ) సోమవారం రాత్రి ఆమోదం తెలిపింది.

ఇదిలావుంటే, రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్‌ శాఖలో 2013లో పదోన్నతులు కల్పించారు. అప్పటి నుంచి ప్రమోషన్లు లభించక అధికారులు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్నత స్థాయి పోస్టులన్నింటినీ ఇక పదోన్నతులతో భర్తీ చేయనున్నారు. అయితే, పదోన్నతులు లభించిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వడంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఎక్సైజ్‌ శాఖలో రెండు అదనపు కమిషనర్‌ పోస్టులున్నాయి. ఒకటి కమిషనరేట్‌లో ఉండగా, మరొకటి ఎస్టాబ్లీష్‌మెంట్‌ విభాగంలో ఉంది. అయితే.. అదనపు కమిషనర్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న జాయింట్‌ కమిషనర్‌ అజయ్‌రావుకు అదనపు కమిషనర్‌గా పదోన్నతి లభించింది. మరో పోస్టుకు అర్హులు లేకపోవడంతో ఆ పోస్టును ఖాళీగా ఉంచనున్నారు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. మూడు జాయింట్‌ కమిషనర్‌ పోస్టులు, 15 డిప్యూటీ కమిషనర్‌, 20 అసిస్టెంట్‌ కమిషనర్‌, 41 ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ (ఈఎస్‌) పోస్టులకు ప్రమోషన్లు లభించినట్లయ్యింది.

Read Also… ప్రకృతి వైపరీత్యాలకు నిర్లక్ష్యమే కారణం.. భారత్‌లో వరదల తీవ్రత ఎక్కువంటున్న శాస్త్రవేత్తలు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu