షోపియన్ ఫేక్ ఎన్ కౌంటర్, తన ఇద్దరు సహచరులతో కలిసి ఆర్మీ కెప్టెన్ ఏం చేశాడంటే ? షాకింగ్ డిటైల్స్, పోలీసుల దిగ్భ్రాంతి

జమ్మూ కాశ్మీర్  షోపియన్ ఫేక్ ఎన్ కౌంటర్  ఘటనలో ఆర్మీ కెప్టెన్ ఒకరు చేసిన నిర్వాకం తెలిసి పోలీసులు షాక్ తిన్నారు. భూపేంద్ర సింగ్, అలియాస్ మేజర్ బషీర్ ఖాన్ అనే ఈయన తన సహచరులతో

షోపియన్ ఫేక్ ఎన్ కౌంటర్, తన ఇద్దరు సహచరులతో కలిసి ఆర్మీ కెప్టెన్ ఏం చేశాడంటే ? షాకింగ్ డిటైల్స్,    పోలీసుల దిగ్భ్రాంతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 30, 2020 | 10:50 AM

జమ్మూ కాశ్మీర్  షోపియన్ ఫేక్ ఎన్ కౌంటర్  ఘటనలో ఆర్మీ కెప్టెన్ ఒకరు చేసిన నిర్వాకం తెలిసి పోలీసులు షాక్ తిన్నారు. భూపేంద్ర సింగ్, అలియాస్ మేజర్ బషీర్ ఖాన్ అనే ఈయన తన సహచరులతో  కలిసి ముగ్గురు అమాయక సోదరులను వాహనంలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశంలో కాల్చి చంపాడని పోలీసులు వెల్లడించారు. వారు మరణించిన అనంతరం వారి మృత దేహాలపై కొన్ని ఆయుధాలు ఉంచి ఎన్ కౌంటర్ లో వారు మరణించినట్టు చిత్రీకరించడానికి ఖాన్ ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ ముగ్గురు అమాయకులను కరడు గట్టిన ఉగ్రవాదులుగా తెలిపాడని, అందుకే కాల్చి చంపామని వెల్లడించాడని వారు చెప్పారు. ఈ ఫేక్ ఎన్ కౌంటర్ లో 16 ఏళ్ళ ఇబ్రార్ అహ్మద్ అనే టీనేజర్ తో బాటు ఇతని సోదరులు ఇంతియాజ్ అహ్మద్, ఇబ్రార్ అనే వారు కూడా హతులయ్యారు. వీరంతా రాజౌరీ జిల్లాకు చెందినవారు. భూపేంద్ర సింగ్ పైన, అతని ఇద్దరు సహచరులపైనా పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు. ఈ ఖాన్..సాక్ష్యాలను తారుమారు చేశాడని, తప్పుడు సమాచారం ఇఛ్చాడని, క్రిమినల్ కుట్రకు పాల్పడ్డాడని వారు ఇందులో పేర్కొన్నారు.

ఉగ్రవాదులకు సంబంధించి సరైన సమాచారం ఇఛ్చినవారికి లభించే ప్రైజ్ మనీని కూడా నిందితులు కాజేయాలనుకున్నారట. ఈ ఫేక్ ఎన్ కౌంటర్ జరిగిన రెండు నెలల తరువాత పోలీసులు వీరిని అరెస్టు చేశారు.