Hindu Temple: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ ఉంది..? నిర్మించడానికి పట్టిన సమయం 30 ఏళ్లు..!
Hindu Temple: దేవాలయాలకు పెట్టింది పేరు భారతదేశం. హిందు, ముస్లిం, క్రిస్టియన్లకు చెందిన ఎన్నో దేవాలయాలు భారత దేశంలో కొలువై ఉన్నాయి. మన దేశంలో హిందువులకు చెందిన..
Hindu Temple: దేవాలయాలకు పెట్టింది పేరు భారతదేశం. హిందు, ముస్లిం, క్రిస్టియన్లకు చెందిన ఎన్నో దేవాలయాలు భారత దేశంలో కొలువై ఉన్నాయి. మన దేశంలో హిందువులకు చెందిన దేవాలయాల (Temples) సంఖ్య లెక్కించడం చాలా కష్టం. కానీ ప్రపంచంలోకెళ్లా పెద్ద హిందువుల ఆలయం కాంబోడియా (Cambodia)లోని ఆంగ్ కోర్ వాట్లో (Angkor Wat) ఉంది. ఆ ఆలయంలో శ్రీ మహావిష్ణువు (Sri Mahavishnu) కొలువై ఉన్నాడు. ఈ ఆలయం ప్రపంచంలోనే పెద్ద హిందు దేవాలయంగా రికార్డుకెక్కింది. 12వ శతాబ్ధంలో సూర్యవర్మస్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. కానీ శిల్పాకళా నైపుణ్యం మాత్రం హిందూ సాంప్రదాయంగా ఉంటుంది. ఆలయ నిర్మాణంలో అక్కడక్కడ తమిళనాడులోని ఆలయాలకు చెందిన శైలి కనిపిస్తుంది. తొలత ఈ సామ్రాజ్యాన్ని ఇతరులు పాలించినా.. అనంతరం హిందూ రాజులు ఈ సామ్రాజ్యాన్ని పాలించారు. హిందువుల పాలనతో ఈ సామ్రాజ్యానికి కాంభోజ రాజ్యంగా పేరొందింది. యూరోపియన్ల రాకతో కాంబోడియాగా మారింది.
భారతదేశంలో మనం చెప్పుకుంటున్న ఇతిహాసాలను కూడా తనలోచూపిస్తూ ఎంతో ఆకట్టుకుంటుంది ఈ ఆలయం. శ్రీ మహావిష్ణువు కొలువైన ఈ ఆలయాన్ని 200 చ .కి.మీ విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయం నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందని సమాచారం. ప్రపంచంలో ఎక్కడైనా నీళ్లు ఎగువ నుంచి దిగువ ప్రాంతానికి ప్రవహిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం నీళ్లు దిగువ నుంచి ఎగువ ప్రాంతానికి ప్రవహిస్తాయట. ఇలా ఎందుకు జరుగుతోందని ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. కంబోడియా దేశ జాతీయ పతాకంలో ఈ దేవాలయానికి స్థానం దక్కింది. హిందువులకు చెందిన ఆలయం మరొక దేశ జాతీయ పతాకంపై ఎగురుతుండటం ఎంతో సంతోషాన్ని ఇచ్చినా.. అదే ఆలయం మన ఇండియాలో లేకపోవడం బాధాకరం.
అంగ్ కోర్ వాట్ నగరం అంటే..
అంగ్ కోర్ వాట్ నగరంలో అప్పట్లోనే సుమారు 10 లక్షల మంది నివసించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఆలయ ప్రాంతంలోనే దాదాపు 5 లక్షల మంది వరకు నివసించి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ ఆలయానికి 40 కిలోమీటర్ల దూరంలో మహేంద్ర పర్వతగా పిలిచే మరో పెద్దనగరం ఉందని వీరు గుర్తించారు. అంగ్ కోర్ వాట్ కేవలం ఒక్క దేవాలయంగా చెప్పలేం. కొన్ని వందల దేవాలయాల సముదాయం. అంగ్ కోర్ వాట్ అంటే దేవాలయాల నగరం అని అర్థమట.
పర్వతాన్ని తలపించేలా ఆలయం..
హిందూ పురాణాల్లో పేర్కొన్న మేరు పర్వతాన్ని తలపించేలా ఈ ఆలయాన్ని అప్పటి రాజు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయ స్థానకేంద్రంపై 213 అడుగుల ఎత్తయిన భారీ గోపురం ఉందట. గోపురానికి నాలుగు దిక్కులా మరో చిన్న చిన్న నాలుగు గోపురాలు ఉన్నాయి. ఆలయానికి చుట్టూ నీటి కందకాన్ని ఏర్పాటు చేశారు. ఈ కందకం 650 అడుగులు, 13 అడుగుల వెడల్పుతో సుమారు 5 కిలోమీటర్ల వరకూ చుట్టుకొలత ఉంటుంది.
ఆలయానికి తూర్పు, పశ్చిమం వైపు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు. ఇందులో పశ్చిమ ద్వారాన్ని ప్రధాన ద్వారంగా పరిగణిస్తారు. ద్వారానికి ఇరువైపులా గంభీరంగా కనిపించే రెండు సింహాల శిల్పాలు ఉంటాయి. ద్వారం నుంచి మొదలుకుని ఆలయం వరకు రాతి కట్టడంతో మార్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన గోపురం కింద అద్భుతమైన పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఖ్మేర్ సామ్రాజ్యం పరిస్థితులు, రామాయణ, మహాభారత గాథలను శిల్పం రూపంలో చెక్కారట.
ఇవి కూడా చదవండి: