కమల్ భయ్యా రేపిన కయ్యం.. మండిపడుతున్న హిందూ సంఘాలు

తొలి ఉగ్రవాది హిందూ అన్న నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్‌పై హిందూ సంఘాల నేతలు మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసమే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అఖిలభారత సంత్ సభ కన్వీనర్ జితేంద్రనాథ్ సరస్వతి విమర్శించారు. టెర్రరిజం ఏ మతంలో ఉందో అందరికీ తెలుసన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన షారూఖ్, అమీర్ ఖాన్ లాంటి నటులకు కూడా గతంలో ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. కాగా, కమల్ వ్యాఖ్యలను ఆర్ఎస్ఎస్ కూడా తీవ్రంగా […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:05 pm, Mon, 13 May 19
కమల్ భయ్యా రేపిన కయ్యం.. మండిపడుతున్న హిందూ సంఘాలు

తొలి ఉగ్రవాది హిందూ అన్న నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్‌పై హిందూ సంఘాల నేతలు మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసమే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అఖిలభారత సంత్ సభ కన్వీనర్ జితేంద్రనాథ్ సరస్వతి విమర్శించారు. టెర్రరిజం ఏ మతంలో ఉందో అందరికీ తెలుసన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన షారూఖ్, అమీర్ ఖాన్ లాంటి నటులకు కూడా గతంలో ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. కాగా, కమల్ వ్యాఖ్యలను ఆర్ఎస్ఎస్ కూడా తీవ్రంగా ఖండించింది.

మరోవైపు కమల్ వ్యాఖ్యలపై బాలివుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించాడు. మీరు కూడా గొప్ప నటులని.. అయితే మన దేశంలో కళలకు మతం లేదని.. అలాగే ఉగ్రవాదానికి కూడా ఈ జాడ్యం లేదని పేర్కొన్న ఆయన.. బహుశా ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ప్రచారం చేస్తున్న మీరు వారి మద్దతును కోరేందుకే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉంటారని ట్వీట్‌లో పేర్కొన్నారు.