Vangaveeti Radha: మున్సిపల్ పోరు.. విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధ ఘన విజయం
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి పార్టీల స్పష్టమైన ఆధిక్యాన్ని చాటాయి. నవంబర్ 3న వెలువడిన ఫలితాల్లో జనసేన అద్భుత విజయం సాధించగా, విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధ లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోరు ముగిసింది. నవంబర్ మూడున వెలువడిన ఫలితాల్లో కూటమి పార్టీలు స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగించాయి. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే చాలా ప్రాంతాల్లో జనసేన పోటీ చేసిన అన్ని ప్రాంతాల్లో విజయం సాధించినట్టు తెలుస్తోంది. ఇక తాజాగా జనసేన పార్టీలో చేరి విజయవాడ మేయర్ బరిలో నిలిచిన వంగవీటి రాధ అద్భుత విజయాన్ని సాధించాడు.ఇక విజయవాడ మేయర్ అభ్యర్థి ఘన విజయం సాధించిన వంగవీటి రాధకు జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
విజయవాడ మేయర్ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన ఆయన లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆయన పుట్టిన రోజు నాడే ఎన్నికల్లో ఘన విజయం సాధించడం.. దీంతో కౌంటింగ్ కేంద్ర దగ్గరే ఆయన కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
ఇక విజయవాడ కార్పొరేషన్లో మొత్తం 86 డివిజన్లు ఉండగా 53 చోట్ల టీడీపీ విజయం సాధించగా.. 19 డివిజన్లను జనసేన పార్టీ కైవసం చేసుసుకుంది. ఇక ప్రతిపక్ష పార్టీ వైసీపీ కేవలం 8 డివిజన్లకే పరిమితమైపోయింది. ఇక నాలుగు చోట్ల బీజేపీ, ఒక చోట CPM, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
వీడియో చూడండి..
Vijayawada Mayor
Vangaveeti Radha Krishna Garu Winning Moment ✊🏻🔥
Bezawada is Under JANASENA control 💥💥💥
#NDAsweepsAP #APLocalBodyElections #JanaSenaStrikesAgain #CheppaamChestunnaam #APLocalPolls @JanaSenaParty https://t.co/nJyPjFzXtb
— BEZAWADA PAWANKALYAN YUVASENA (@B_P_YCULTS) November 3, 2026
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
