కార్తీ “సుల్తాన్” మూవీకి బ్రేక్.. కారణమేంటంటే..?
తమిళ హీరో కార్తీ సినిమాకి చిక్కొచ్చిపడింది. తాజాగా కార్తీ నటిస్తున్న సుల్తాన్ సినిమా షూటింగ్‌ని శివసేన, హిందూ సంఘాలు అడ్డుకున్నాయి. సుల్తాన్ అనే సినిమా టైటిల్‌తో.. హిందూ దేవాలయంలో చిత్రీకరణ చేయడాన్ని వారు తప్పుబట్టారు. పవిత్రమైన పద్మగిరీశ్వరం దేవాలయంలో మద్యం సేవించడం, మహిళలతో నృత్యాలు, హిందూ సంప్రదాయాలను కించపరచడం అవుతుందని ఆందోళన చేశారు. వెంటనే సినిమా షూటింగ్‌ని ఆపివేసి.. దేవాలయం నుంచి వెళిపోవాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు చిత్ర బృందాన్ని అక్కడి […]

తమిళ హీరో కార్తీ సినిమాకి చిక్కొచ్చిపడింది. తాజాగా కార్తీ నటిస్తున్న సుల్తాన్ సినిమా షూటింగ్‌ని శివసేన, హిందూ సంఘాలు అడ్డుకున్నాయి. సుల్తాన్ అనే సినిమా టైటిల్‌తో.. హిందూ దేవాలయంలో చిత్రీకరణ చేయడాన్ని వారు తప్పుబట్టారు. పవిత్రమైన పద్మగిరీశ్వరం దేవాలయంలో మద్యం సేవించడం, మహిళలతో నృత్యాలు, హిందూ సంప్రదాయాలను కించపరచడం అవుతుందని ఆందోళన చేశారు. వెంటనే సినిమా షూటింగ్‌ని ఆపివేసి.. దేవాలయం నుంచి వెళిపోవాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు చిత్ర బృందాన్ని అక్కడి నుంచి పంపించివేశారు. కాగా, భాగ్యరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. కార్తీ, రష్మిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.