విజయ్ సేతుపతి ‘సింధు బాద్’ కు హైకోర్టు బ్రేక్

తమిళ హీరో విజయ్ సేతుపతి, అంజలి జంటగా నటించిన సింధుబాద్ తమిళచిత్రం విడుదలకు బ్రేక్ పడింది. ఈ మూవీ విడుదలను నిలిపివేయాలని హైదరాబాద్ హైకోర్డు ఆదేశాలు జారీచేసింది. విజయ్ సేతుపతి హీరోగా అరుణ్ కుమార్ డెరెక్షన్ లో   తమిళ నిర్మాత రాజరాజన్ ఈ చిత్రాన్ని  నిర్మించారు. అయితే ఆయన గతంలో ఎస్ ఎస్ రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ  బాహుబలి చిత్రం  తమిళ హక్కుల్ని ఆర్కా మీడియానుంచి పొందారు. బాహుబలి మూవీ తమిళనాడులో బ్రహ్మాండమైన వసూళ్లను […]

  • Anil kumar poka
  • Publish Date - 5:49 pm, Fri, 21 June 19
విజయ్ సేతుపతి 'సింధు బాద్' కు హైకోర్టు  బ్రేక్

తమిళ హీరో విజయ్ సేతుపతి, అంజలి జంటగా నటించిన సింధుబాద్ తమిళచిత్రం విడుదలకు బ్రేక్ పడింది. ఈ మూవీ విడుదలను నిలిపివేయాలని హైదరాబాద్ హైకోర్డు ఆదేశాలు జారీచేసింది.

విజయ్ సేతుపతి హీరోగా అరుణ్ కుమార్ డెరెక్షన్ లో   తమిళ నిర్మాత రాజరాజన్ ఈ చిత్రాన్ని  నిర్మించారు. అయితే ఆయన గతంలో ఎస్ ఎస్ రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ  బాహుబలి చిత్రం  తమిళ హక్కుల్ని ఆర్కా మీడియానుంచి పొందారు.

బాహుబలి మూవీ తమిళనాడులో బ్రహ్మాండమైన వసూళ్లను రాబట్టింది.  మొత్తం  రూ.28 కోట్లు  కలెక్ట్ చేసింది. అయితే అగ్రిమెంట్ ప్రకారం  ఈ మూవీ   హక్కుల్ని అమ్మిన ఆర్కా మీడియాకు చెందిన  శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలకు  రాజరాజన్ రూ.12.5 కోట్లు బాకీ పడ్డారు. అయితే ఎన్నిసార్లు అడిగినా ఇవ్వాల్సిన బాకీ సొమ్మును  తమకు చెల్లించడంలేదంటూ రాజరాజన్ పై   బాహుబలి నిర్మాతలు ఇద్దరూ  హైదరాబాద్ హైకోర్డును ఆశ్రయించారు.  కేసును విచారించిన న్యాయస్ధానం బాకీ సొమ్మును చెల్లించే వరకు సింధు బాద్ చిత్రం విడుదల నిలిపివేయాలని ఆదేశించింది.
  సింధు బాద్ చిత్రం తమిళంలో హైప్ క్రియేట్ చేస్తున్న సమయంలో హైకోర్టు తాజా ఆదేశాలపై నిర్మాత రాజరాజన్ ఎలా స్పందిస్తారో చూడాలి.