AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏవోబీలో మావో అగ్రనేతలు.. విశాఖలో హైఅలర్ట్

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేతలు కాపు కాశారు. మావో అగ్రనేతలైన చలపతి, అరుణ, నవీన్ అక్కడే ఉన్నారని భద్రతాబలగాలకు సమాచారం అందడంతో.. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు సీలేరులో ఇద్దరు హోంగార్డులు మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీంతో విశాఖ మన్యంలో హై అలర్ట్ కొనసాగుతోంది. కాగా శనివారం ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటనలో ముగ్గురు పోలీసులు […]

ఏవోబీలో మావో అగ్రనేతలు.. విశాఖలో హైఅలర్ట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 12, 2019 | 2:03 PM

Share

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేతలు కాపు కాశారు. మావో అగ్రనేతలైన చలపతి, అరుణ, నవీన్ అక్కడే ఉన్నారని భద్రతాబలగాలకు సమాచారం అందడంతో.. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

మరోవైపు సీలేరులో ఇద్దరు హోంగార్డులు మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీంతో విశాఖ మన్యంలో హై అలర్ట్ కొనసాగుతోంది. కాగా శనివారం ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే.