AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heroine Kajal Aggarwal: అందాల చందమామ అందమైన మనసు.. అభిమాని చదువుకోసం లక్ష ఆర్ధిక సాయం..

Heroine Kajal Aggarwal: లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరపై అడుగు పెట్టి.. దశాబ్ద కాలంలో స్టార్ హీరోయిన్ గా కెరీర్ లో దూసుకుపోతుంది కాజల్ అగర్వాల్. ఈ అందాల చందమామకు మేని సొగసే కాదు,, మంచి మనసు కూడా ఉందని మరోసారి...

Heroine Kajal Aggarwal: అందాల చందమామ అందమైన మనసు.. అభిమాని చదువుకోసం లక్ష ఆర్ధిక సాయం..
Surya Kala
|

Updated on: Apr 05, 2021 | 4:48 PM

Share

Heroine Kajal Aggarwal: లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరపై అడుగు పెట్టి.. దశాబ్ద కాలంలో స్టార్ హీరోయిన్ గా కెరీర్ లో దూసుకుపోతుంది కాజల్ అగర్వాల్. ఈ అందాల చందమామకు మేని సొగసే కాదు,, మంచి మనసు కూడా ఉందని మరోసారి నిరూపించింది. కష్టంలో ఉన్నాను ఆదుకోండి అన్న అభిమాని ఆర్తిని విన్న కాజల్ అండగా నిలబడింది. దీంతో బాహ్య సౌందర్యంతో పాటు.. ఆత్మ సౌందర్యం కల చిన్నది మా మిత్రవింద అంటారు అభిమానులు. ఇప్పటికే పలుమార్లు ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న కాజల్..తాజాగా చెడుకోసం ఫీజు కట్టే కట్టే స్టేజ్ లో లేను.. ఆదుకోండి అని వేడుకున్న ఓ అమ్మాయికి నిలబడింది. లక్ష రూపాయల ఫీజు కట్టింది. వివరాల్లోకి వెళ్తే.

సుమ అనే ఓ విద్యార్థి తన పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా తన అవసరం గురించి చెప్పి.. ఎవరైనా ఆదుకోవాలని అందరినీ కోరింది. ప్రస్తుతం తాను ఎం.ఫార్మసీ చదువుతున్నానని, ఈ మధ్యనే తన జాబ్ పోయిందని వెల్లడించింది. పరీక్ష ఫీజుకోసం చాలా డబ్బులు అవసరం ఉందని, ఎవరైనా సహాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా వేసుకొంది. అంతేకాదు తన పరీక్ష ఫీజు కోసం మొత్తం రూ. 53, 000 అవసరమని తెలిపింది. ఈ ఫీజ్ చెల్లించకపోతే ఇన్నాళ్లు పడిన తన కష్ట వృధా అని.. పరీక్షలకు అనుమానివ్వరు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం స్టార్ హీరోయిన్ కాజల్ చెవిన పడింది. వెంటనే తన వాళ్ళని రంగంలోకి దింపి.. ఆ అమ్మాయి ఫీజు విషయం నిజమో కాదో తెలుసుకోమని ఆదేశించింది.

సుమ పరిస్థితి గురించి టీమ్ ఆరా తీయగా.. ఆమె కష్టాల్లో ఉన్నది నిజమేనని తేలింది. ఇదే విషయం కాజల్ కు చెప్పారు. వెంటనే కాజల్ ఆ అమ్మాయి అకౌంట్ కు లక్ష రూపాయలను గూగుల్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేసింది. ఈ విషయం స్క్రీన్ షాట్ తో సహా సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. చందమామ మంచి మనసు పై నెటిజన్లు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: లాక్ డౌన్ సమయంలో బామ్మ మనవరాలు స్వీట్స్ వ్యాపారం.. 8 నెలల్లో లక్షల్లో సంపాదన..