జగన్ చుట్టూ పెద్ద కుట్ర జరుగుతున్నట్లుంది: హీరో రామ్
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి హీరో రామ్ పలు సంచలన ట్వీట్లు చేశాడు. '' పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది!! సీఎంని తప్పుగా చూపించడానికి!'' అంటూ సంచలన ట్వీట్ చేశాడు.
Hero Ram Sensational Tweets: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి హీరో రామ్ పలు సంచలన ట్వీట్లు చేశాడు. ” పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది!! సీఎంని తప్పుగా చూపించడానికి!” అంటూ సంచలన ట్వీట్ చేశాడు. కొంతమంది ఆయనకు తెలియకుండా చేస్తున్న పనుల వల్ల జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని.. వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నానంటూ రామ్ పేర్కొన్నాడు. అందరినీ ఫూల్స్ చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లిస్తున్నారని వివరించాడు. కాగా, స్వర్ణ ప్యాలెస్‌ను రమేష్ హాస్పిటల్ కంటే ముందు ప్రభుత్వమే కోవిడ్ సెంటర్‌ను నిర్వహించిందని పేర్కొన్నాడు.
పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది!! సీఎంని తప్పుగా చూపించడానికి! @ysjagan garu.మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ రెప్యుటేషన్ కీ,మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది.వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం?#APisWatching
— RAm POthineni (@ramsayz) August 15, 2020
ఫైర్ + ఫీజు = ఫూల్స్
అందరినీ ఫూల్స్ చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లిస్తున్నారా?
ఫీజుల వివరణ: మేనేజ్మెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్న స్వర్ణప్యాలెస్ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసింది. #APisWatching pic.twitter.com/6TT1K2H4n2
— RAm POthineni (@ramsayz) August 15, 2020
హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు , ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు ?#APisWatching pic.twitter.com/YqXmweqdgP
— RAm POthineni (@ramsayz) August 15, 2020