ప్రభాస్ కామన్ డీపీ తో షురూ చేశారు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు హంగామా నెట్టింట్లో స్టార్ట్ చేశారు అతడి ఫ్యాన్స్. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా అప్పుడే కౌంట్ డౌన్ షురూ చేశారు. బాహుబలి గెటప్ లో చిరునవ్వులు చిందిస్తోన్న ప్రభాస్ ఫొటోను..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు హంగామా నెట్టింట్లో స్టార్ట్ చేశారు అతడి ఫ్యాన్స్. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా అప్పుడే కౌంట్ డౌన్ షురూ చేశారు. బాహుబలి గెటప్ లో చిరునవ్వులు చిందిస్తోన్న ప్రభాస్ ఫొటోను పెట్టి కామన్ డీపీని విడుదల చేశారు. ఫ్రేమ్ చుట్టూ ప్రభాస్ నటించిన సినిమాల పేర్లను పెట్టారు. ఇప్పటికే తమ హీరో ఫిట్ నెస్ ట్రైనర్ కు పెద్ద కారు ఇవ్వడంతో పొంగిపోయిన ప్రభాస్ అభిమానులు నిన్నంతా ఆ సందడి సందడి చేయగా, ఇవాళ డీపీతో ముందుకొచ్చారు. ప్రభాస్ దగ్గర చాలాకాలంగా ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్న లక్ష్మణ్‌కు ప్రభాస్ ఖరీదైన రేంజ్‌రోవర్ కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో లక్ష్మణ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన ఫ్యామిలీతో కలిసి కారు ముందు ప్రభాస్ తో కలిసి ఫొటోలు తీసుకొని సంబరపడ్డాడు లక్ష్మణ్. ప్రస్తుతం డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ రూపొందిస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడు.
Rebel Star #Prabhas pic.twitter.com/a5hdKYttjZ
— BARaju (@baraju_SuperHit) September 6, 2020