నాని రిలీజ్ చేసిన ‘వేయి శుభములు కలుగు నీకు’ ఫస్ట్ లుక్

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరో డెబ్యూ మూవీ 'వేయి శుభములు కలుగు నీకు'. తమన్నా వ్యాస్ హీరోయిన్. రామ్స్ రాథోడ్ దర్శకత్వం లో..

నాని రిలీజ్ చేసిన 'వేయి శుభములు కలుగు నీకు' ఫస్ట్ లుక్
Follow us

|

Updated on: Aug 27, 2020 | 9:24 PM

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరో డెబ్యూ మూవీ ‘వేయి శుభములు కలుగు నీకు’. తమన్నా వ్యాస్ హీరోయిన్. రామ్స్ రాథోడ్ దర్శకత్వం లో జయ దుర్గ దేవి మల్టీ మీడియా బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ తోపాటు, మోషన్ పోస్టర్ ను నాచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శివాజీ నానికి థ్యాంక్స్ చెప్పారు. అందరి క్షేమం కాంక్షించే హీరో నాని అని శివాజీ చెప్పుకొచ్చారు. హీరో నాగ శౌర్య క్లాప్ తో మొదలైన ఈ సినిమా ఏకధాటిగా షూటింగ్ జరుపుకుందన్నారు. తనను ఆశీర్వదించి నట్టే కుమారుడు ని తెలుగు ప్రేక్షకులు ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందని శివాజీ అన్నారు. ఈ చిత్రంలో శివాజీ రాజా సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా, వెంకట్ నారాయణ, సన, అనంత్, చమ్మక్ చంద్ర, మిర్చి హేమంత్, రోహిణి, జబర్దస్త్ అప్ప రావు, జబర్దస్త్ మురళి తదితరులు ఇతర తారాగణంగా ఉన్నారు.

Latest Articles