ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ.. అసలు కారణమిదేనా.?
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జోరందుకున్న వివాదానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా తరహాలో ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం శాసనసభలో రాజధాని విషయంపై జగన్ మాట్లాడుతూ.. తన ప్రసంగంలో దక్షిణాఫ్రికా ఫార్ములాను ప్రస్తావించారు. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు వున్న సంగతిని తెలిపారు. అదే విధంగా వినూత్న నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలున్నాయని జగన్ చెప్పారు. ప్రస్తుతం వున్న అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా కొనసాగిస్తామని హింట్ ఇచ్చిన […]

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జోరందుకున్న వివాదానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా తరహాలో ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం శాసనసభలో రాజధాని విషయంపై జగన్ మాట్లాడుతూ.. తన ప్రసంగంలో దక్షిణాఫ్రికా ఫార్ములాను ప్రస్తావించారు. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు వున్న సంగతిని తెలిపారు. అదే విధంగా వినూత్న నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలున్నాయని జగన్ చెప్పారు. ప్రస్తుతం వున్న అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా కొనసాగిస్తామని హింట్ ఇచ్చిన ఆయన విశాఖలో బ్రహ్మాండమైన మౌలిక వసతులు వున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని చెప్పారు. అదే విధంగా జ్యూడిషియరీ కేపిటల్‌గా కర్నూలు నగరాన్ని గుర్తించే అవకాశాలున్నాయన్నారు సీఎం జగన్.
రాజధాని పేరిట చంద్రబాబు భూబాగోతాలు నడిపారంటూ సీఎం నిప్పులు చెరిగారు. రాజధాని ప్రాంతంలో 4,070 ఎకరాలను తన బినామీలకు, తన వాళ్ళకు చంద్రబాబు కేటాయించారని వివరించారు. రాజధాని ఒకే చోట ఉండాలన్న ధోరణి మారాలని.. దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో మూడు రాజధానులు ఉన్నాయని ఆయన మరోసారి గుర్తు చేశారు.
ప్రభుత్వ భూములు, పరిపాలనా వ్యవహారాలకు అనువైన వాతావరణం, ఉద్యోగులందరికీ కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ విశాఖలో ఉండటం వల్లే వైసీపీ ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సభలో సీఎం కూడా ఒక్క మెట్రో రైల్ తప్పితే పరిపాలనకు కావలసిన అన్ని వసతులూ విశాఖలో ఉన్నాయని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం నిపుణల కమిటీ అధ్యయనం చేస్తున్నారని.. వారంలోగా పూర్తి నివేదిక ఇవ్వనున్నారని తెలిపారు. ఒకవేళ ఇదే జరిగితే సెక్రటేరియేట్‌ను అమరావతి నుంచి తరలించడమే కాకుండా ఇకపై పరిపాలనా వ్యవహారాలన్నీ కూడా అక్కడి నుంచే కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.




