Oral Health : నోటి పరిశుభ్రతకు మెదడు ఆరోగ్యానికి సంబంధం ఉంటుందని మీకు తెలుసా.?
చాలా మంది శరీర శుభ్రతను పాటిస్తారు. జుట్టు సంరక్షణ గురించి ఆలోచిస్తారు. కానీ నోటి శుభ్రత గురించి ఎప్పుడూ ఆలోచించరు. మనశ్వాస తాజాగా ఉంటేనే...మనతో నలుగురు దగ్గరగా మాట్లాడతారు.

చాలా మంది శరీర శుభ్రతను పాటిస్తారు. జుట్టు సంరక్షణ గురించి ఆలోచిస్తారు. కానీ నోటి శుభ్రత గురించి ఎప్పుడూ ఆలోచించరు. మనశ్వాస తాజాగా ఉంటేనే…మనతో నలుగురు దగ్గరగా మాట్లాడతారు. నోట్లో నుంచి దుర్వాసన వస్తే దూరంగా ఉంటారు. కాబట్టి నోటి శుభ్రత అనేది చాలా ముఖ్యం. నోరు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. అవును నోటికి శరీర ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంది. నోరు శుభ్రంగా ఉంటే దంతాలు, చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మీకు ఆరోగ్యకరమైన దంతాలు కావాలంటే, ఆరోగ్యకరమైన చిగుళ్ళు కలిగి ఉండటం చాలా ముఖ్యం. దంతాలను చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా అనేది ఇప్పుడు ప్రశ్న. కాబట్టి చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ సులభమైన పద్ధతులను తెలుసుకుందాం.
నోటి పరిశుభ్రతకు మెదడు ఆరోగ్యానికి మధ్య సంబంధం:
నోటి పరిశుభ్రతకు మెదడు ఆరోగ్యానికి మధ్యసంబంధం ఏంటి అనుకుంటున్నారా. అవును నోరు శుభ్రంగా మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడైంది. నోరు శుభ్రంగా లేకుంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా జ్ఞాపకశక్తి, చిగుళ్లవ్యాధి, నరాలు జివ్వు మనడం వంటి ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని తేలింది. నోటి పరిశుభ్రత పాటించనట్లయితే…దంతాలు, చిగుళ్లు వ్యాధులకు దారితీస్తుందని వెల్లడించారు.
రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం:
సాధారణంగా మనం రోజుకు ఒకసారి బ్రష్ చేస్తుంటాం. ఉదయం లేవగానే బ్రష్ చేస్తాం. చాలా మంది పడుకునే ముందు బ్రష్ చేసుకోరు. రాత్రి భోజనం చేసిన తర్వాత నోటిలో మిగిలిపోయిన ఆహార కణాలు అలాగే ఉండిపోతాయి. సమయం గడిచేకొద్దీ పాచిపోయి…నోరు కూడా పాచిగా మారుతుంది. ఉదయం ఏదో మొక్కుబడిగా బ్రష్ చేసుకున్నట్లయితే అది నోటి దుర్వాసనకు దారితీస్తుంది. చిగుళ్ళలో పుండ్లు, దంతాల రంగు మారడం, దంతాలు అరిగిపోయి ఏదైనా తినేటపుడు నరాలు జివ్వుమని లాగడం మొదలౌతుంది. కాబట్టి రాత్రి పడుకునేముందు కూడా బ్రష్ చేసుకోవడం చాలా ముఖ్యం.
ఫ్లాస్:
వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఫ్లాసింగ్ చేయండి. దీని కారణంగా, దంతాలలో పేరుకుపోయిన మురికిని తొలగించడం వల్ల అవి చెడిపోయే ప్రమాదం తగ్గుతుంది.
గార్గల్:
గోరువెచ్చని నీటిలో ఉప్పు లేదా బేకింగ్ సోడా వేసి పుక్కిలించాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది. బ్రష్ చేసిన తర్వాత ఇలా చేయడం వల్ల మీ నోటి సమస్యలు దూరం అవుతాయి. ఫోలిక్ యాసిడ్‌ను మౌత్ వాష్‌గా ఉపయోగించడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
సహజ ఔషధాలు:
జీర్ణక్రియలో సహాయపడే సహజ ఔషధాలు మీ చిగుళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ మందులు మీ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా నోటి దుర్వాసన, బ్లీచింగ్ సమస్యలను దూరం చేస్తాయి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం