హేమంత్ హత్య కేసు వేగవంతం.. మరో నలుగురు అరెస్ట్

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసులో మరో నలుగురి నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు.

హేమంత్ హత్య కేసు వేగవంతం.. మరో నలుగురు అరెస్ట్
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 05, 2020 | 5:13 PM

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసులో మరో నలుగురి నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. హేమంత్ హత్యకు మొదట ఒప్పందం చేసుకున్న కిరాయి హంతకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హేమంత్ ను హతమార్చేందుకు రూ. 10 లక్షల డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందుకోసం ఈ సుఫారీ గ్యాంగ్ లక్ష రూపాయలను అడ్వాన్స్ తీసుకున్నారు. డబ్బులు చేతికి అందగానే ఫోన్ ఆఫ్ చేయడంతో అవంతి మేనమామ యుగంధర్ రెడ్డి మరో సుఫారీ గ్యాంగ్‌ బిచ్చు యాదవ్ తో కలిసి మర్డర్‌కి స్కెచ్ వేశారు. కస్టడీలో ఉన్న నిందితులు ఇచ్చిన సమాచారంతో ఈ కిరాయి హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు లక్ష్మారెడ్డి, యుగంధర్ రెడ్డి కస్టడీ ముగియడంతో వీరిద్దరిని కోర్టుకు తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు సైబరాబాద్ పోలీసులు.

హేమంత్ హత్య కేసులో 25 మంది ప్రమేయం ఉన్నట్లుగా మాదాపూర్ డీసీపీ తెలిపారు. హేమంత్ హత్య కేసులో సోమయాజులురాజు అనే వ్యక్తి మొదటి నుండి ఈ ప్లాన్ లో ఉన్నాడని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. సుపారీ తీసుకోవడంతో పాటు ప్లాన్ అమలు చేయడంలో కీలకం ఇతనే కీలమని డీసీపీ వివరించారు. హేమంత్ ను హత్య చేసేంత వరకు లక్ష్మారెడ్డితో రాజు ఉన్నాడని.. సోమయాజులురాజు, కృష్ణ, బిచ్చుయాదవ్, మహ్మద్ పాషాలు హేమంత్ ను హత్య చేశారని డీసీపీ వెల్లడించారు. గతంలో ఇతనిపై పటాన్ చెరువు పోలీసు స్టేషన్ లో రౌడీషీటర్ కూడా ఉందన్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు విజేందర్ రెడ్డి, రాకేశ్ రెడ్డి, సందీప్ రెడ్డి, పటేల్ లను కస్టడీ కోరామని.. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంటామన్నారు డీసీపీ.