తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!

ఓవైపు కరోనా కష్టాలు.. మరోవైపు అతి భారీ వర్షాలు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితి. రుతుపవనాలు దేశమంతటా విస్తరించి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2020 | 9:05 AM

ఓవైపు కరోనా కష్టాలు.. మరోవైపు అతి భారీ వర్షాలు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితి. రుతుపవనాలు దేశమంతటా విస్తరించి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కార‌ణంగా ఉభ‌య తెలుగు రాష్ట్రాలలో గ‌త రెండు రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. మ‌రికొన్ని రోజులు వ‌ర్షాల తీవ్రత కొన‌సాగే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ క్రమంలో తెలంగాణలో రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కరీంనగర్ జిల్లా మానకొండూరులో 27.3 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. వరంగల్ రూరల్‌లో 22 నుంచి 27 సెంటీమీటర్ల వర్షపాతం, సిద్దిపేట జిల్లాలో 21 సెంటీమీటర్ల వర్షపాతం, వరంగల్ అర్బన్ ములుగు జిల్లాలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లోని చార్మినార్ , కీసర, హయత్ నగర్, బహుదూర్‌పుర, రాజేంద్రనగర్, ఆసిఫ్ నగర్, సరూర్ నగర్, మాదాపూర్, నాంపల్లి ఏరియాల్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం‌ నమోదైంది.