AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోదీ ఏమన్నారంటే…

ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ విదేశీ మారక ద్రవ్య నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు సాగుతున్నది. కోట్లాది రూపాయలు దేశం బయట దాచుకున్నారనే ఆరోపణలున్నాయి. యూపీఏ ప్రభు త్వం ఉన్నప్పుడు ఆయన దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా లండన్‌లో మకాం పెట్టారు. 2011లో ఆయన పాస్‌పోర్టును రద్దు చేశారు. అయితే ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తరువాత లలిత్ మోదీ పట్ల మెతకగా ఉన్నదనే అభిప్రాయం ఉన్నది. ఆయన పాస్‌పోర్టును రద్దు చేయడాన్ని హైకోర్టు కొట్టివేసింది. […]

ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోదీ ఏమన్నారంటే...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 28, 2019 | 9:40 PM

Share

ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ విదేశీ మారక ద్రవ్య నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు సాగుతున్నది. కోట్లాది రూపాయలు దేశం బయట దాచుకున్నారనే ఆరోపణలున్నాయి. యూపీఏ ప్రభు త్వం ఉన్నప్పుడు ఆయన దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా లండన్‌లో మకాం పెట్టారు. 2011లో ఆయన పాస్‌పోర్టును రద్దు చేశారు. అయితే ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తరువాత లలిత్ మోదీ పట్ల మెతకగా ఉన్నదనే అభిప్రాయం ఉన్నది. ఆయన పాస్‌పోర్టును రద్దు చేయడాన్ని హైకోర్టు కొట్టివేసింది. దీనిపై ఎన్డీయే ప్రభుత్వం అపీలు చేయలేదు.

లలిత్ మోదీ ఉదంతం బీజేపీలోని అంతర్గత కలహంగా.. కాంగ్రెస్ పార్టీ ఎన్డీయే ప్రభుత్వంపై దాడి చేయడానికి ఆయుధంగా మారింది. కానీ ఈ ఉదంతాలన్నీ అంతిమంగా మన పరిపాలనా, రాజకీయ వ్యవస్థలోని బలహీనతలను వెల్లడిస్తున్నాయి. లలిత్ మోదీ నేరస్తుడా కాదా అనేది ఇంకా తేలనే లేదు. ఈ దశలో ఆయనపై దోషిగా ముద్ర వేయలేం. అయితే తనపై ఆరోపణలు వచ్చినప్పుడు విదేశాలలో తలదాచుకోకుండా, మన దేశానికి తిరిగి వచ్చి దర్యాప్తును ఎదుర్కోవడం పౌరుడిగా లలిత్ మోదీ బాధ్యత. లలిత్ మోదీపై ఉన్న పదహారు కేసులలో పదిహేనింటిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. అవి ఇప్పటికీ అమలులో ఉన్నాయని అంటున్నారు. లలిత్ మోదీ ఆచూకీ కనిపెట్టి ఉండడానికి బ్లూ కార్నర్ నోటీసు కూడా జారీ అయింది.

నెట్‌ఫ్లిక్స్‌లో పేట్రియాట్ ఆక్ట్ స్టార్ అయిన హసన్ మిన్హజ్ లలిత్ మోదీని ఇటీవల లండన్ లో కలిసి ఇంటర్వ్యూ చేసారు. అందులో భాగంగా లలిత్ మోదీ జైలు శిక్షను తప్పించుకోవడానికే భారతదేశాన్ని విడిచిపెట్టినట్లు హసన్ తెలిపారు. కాగా లలిత్ మోదీ మాత్రం తాను “200 గంటల పాటు సమాజ సేవ” చేశానని చెప్పారు. కొకైన్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మార్గంమధ్యలో తనను ఎవరో దోచుకున్నారని ఆయన పేర్కొన్నారు. కొకైన్ వాడడం తన జీవితంలో ఒక భాగం అని, ఆ విషయాన్ని నేను అవమానంగా భావించడం లేదని లలిత్ వివరించారు. హసన్ మాట్లాడుతూ “ఫ్రాంచైజ్ యజమానుల కోసం వేలంలో ఎనిమిది సార్లు రిగ్గింగ్ కు పాల్పడినట్లు బిసీసీఐ మిమ్మల్ని దోషిగా గుర్తించింది” దానికి మీరేమంటారు అని అడగగా..  బీసీసీఐ పెట్టిన కేసులన్నీ అవాస్తవమని.. తను ఏ తప్పు చేయలేదని లలిత్ మోదీ స్పష్టం చేశారు. కాగా 2010 ఐపీఎల్ తరువాత మోదీ లండన్ కు పారిపోయాడు.