రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ మరణంపై అనుమానాలున్నాయి…!

లోక్‌ జనశక్తి పార్టీ స్థాపకుడు రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ మరణంపై దర్యాప్తు చేయాలని హిందూస్థానీ అవామ్‌ మోర్చా డిమాండ్‌ చేస్తోంది.. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఓ లేఖ కూడా రాసింది.. దళిత నేత, కేంద్రమంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ మరణాన్ని ఇప్పటికీ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, అలాంటిది ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వానేమో నవ్వుతూ కనిపిస్తున్నారని హిందూస్థానీ అవామ్‌ మోర్చా అంటోంది.. తండ్రి మరణించిన రెండు రోజులకే చిరాగ్‌ పాశ్వాన్‌ షూటింగ్స్‌లో పాల్గొన్నారని, అందుకే పలు […]

రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ మరణంపై అనుమానాలున్నాయి...!
Follow us

|

Updated on: Nov 02, 2020 | 5:31 PM

లోక్‌ జనశక్తి పార్టీ స్థాపకుడు రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ మరణంపై దర్యాప్తు చేయాలని హిందూస్థానీ అవామ్‌ మోర్చా డిమాండ్‌ చేస్తోంది.. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఓ లేఖ కూడా రాసింది.. దళిత నేత, కేంద్రమంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ మరణాన్ని ఇప్పటికీ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, అలాంటిది ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వానేమో నవ్వుతూ కనిపిస్తున్నారని హిందూస్థానీ అవామ్‌ మోర్చా అంటోంది.. తండ్రి మరణించిన రెండు రోజులకే చిరాగ్‌ పాశ్వాన్‌ షూటింగ్స్‌లో పాల్గొన్నారని, అందుకే పలు సందేహాలు కలుగుతున్నాయని ఆరోపిస్తోందా పార్టీ.. కేంద్ర మంత్రి పదవిలో ఉంటున్న రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ఆరోగ్యంపై ఎయిమ్స్‌ హాస్పిటల్‌ హెల్త్‌ బులిటెన్‌ను ఎందుకు విడుదల చేయలేదో చెప్పాలని ప్రశ్నించింది.. ఇదిలా ఉంటే తన తండ్రి మరణంపై దర్యాప్తు చేయాలని కోరడం కేవలం రాజకీయం కోసమేనని అన్నారు చిరాగ్ పాశ్వాన్‌. చనిపోయిన వ్యక్తిపై రాజకీయాలు చేయడమేమిటని ఈసడించుకున్నారు.. ఇలా మాట్లాడటానికి సిగ్గుండాలి అని తిట్టిపోశారు. తన తండ్రి గురించి జితన్‌రామ్ మాంఝీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని చిరాగ్‌ ఆగ్రహించారు. ఆయన బతికున్నప్పుడు ఏనాడూ మాంఝీ కలవలేదని, హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కూడా పలకరించడానికి రాలేదని చెప్పారు చిరాగ్‌. తన తండ్రి పాశ్వాన్‌ ఆరోగ్య పరిస్థితి గురించి మాంఝీకి చాలా సార్లు ఫోన్‌ చేసి చెప్పానని, అయినా ఆయన తన తండ్రిని కలవలేదని తెలిపారు. రేపు బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరుగుతున్నందుకే హఠాత్తుగా మాంఝీకి తన తండ్రి గుర్తుకొచ్చారని చిగార్ ఆరోపించారు. ప్రధానికి లేఖ రావడం వెనుక కేవలం రాజకీయ దురుద్దేశం మాత్రమే ఉందన్నారు చిరాగ్‌ పాశ్వాన్‌..